టాలెంట్, లక్ ఉన్నంత మాత్రాన సరిపోదు, టీమిండియా తరుపున రాణించాలంటే అది బాగుండాలి...

Published : Jun 07, 2022, 06:09 PM IST

టీమిండియా తరుపున ఆడిన దానికంటే ఐపీఎల్‌లో అదరగొట్టిన ప్లేయర్లలో సురేష్ రైనా ఒకడు. పేలవ ప్రదర్శనతో భారత జట్టులో చోటు కోల్పోయినప్పటికీ, ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ‘మిస్టర్  ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు రైనా...

PREV
16
టాలెంట్, లక్ ఉన్నంత మాత్రాన సరిపోదు, టీమిండియా తరుపున రాణించాలంటే అది బాగుండాలి...

టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి ఏకైక మార్గంగా మారిపోయింది ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15లో పర్ఫామెన్స్ కారణంగానే ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యంగ్ పేసర్లకు సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో చోటు కల్పించారు సెలక్టర్లు...

26

ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు టీమిండియా యంగ్‌స్టర్స్‌కి తనదైన స్టైల్‌లో సలహాలు, సూచనలు ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా.. ‘ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత టీమిండియా తరుపున కూడా అలాగే ఆడాలని కోరుకుంటారు అభిమానులు, సెలక్టర్లు, మేనేజ్‌మెంట్...

36

అయితే ఐపీఎల్ ఆడిన దాని కంటే టీమిండియాకి ఎలా ఆడామనేది చాలా ముఖ్యం.  భారత జట్టులో సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించాలంటే టాలెంట్, లక్ ఉంటే మాత్రం సరిపోదు, మైండ్‌సెట్ కూడా చాలా అవసరం...

46

టీమిండియా తరుపున ఆడుతున్నప్పుడు వాతావరణ పరిస్థితులను, ఇతర కష్టాలను తట్టుకుని నిలబడగలగాలి. తీవ్రమైన ఒత్తిడిని జయిస్తేనే సరైన పర్ఫామెన్స్ ఇవ్వగలం...

56

ఈసారి నా వరకూ ఇద్దరు యంగ్‌స్టర్స్‌ పర్ఫామెన్స్ ఎలా ఇస్తారోనని బాగా వెయిట్ చేస్తున్నా. వాళ్లు ఎవరో కాదు, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్... ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చారు. మిగిలిన బౌలర్ల కంటే తాము ఎందుకు భిన్నమో, ప్రత్యేకమో నిరూపించుకుని టీమ్‌లో చోటు దక్కించుకున్నారు...

66

అందుకే ఈ ఇద్దరిని కెఎల్ రాహుల్ ఎలా వాడుకుంటాడో చూడాలని ఎదురుచూస్తున్నా... కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఈ సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈసారి అతను కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడనే అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా...  

click me!

Recommended Stories