ఒకవేళ ఎంఎస్ ధోనీ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వస్తే, కెప్టెన్సీలో కూడా మార్పులు జరగవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ కు షాక్ తగలవచ్చు. ఐపీఎల్ 2024 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించారు, కానీ అతని కెప్టెన్సీలో జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. పంత్‌ను జట్టులోకి చేర్చుకోవడంలో ఫ్రాంచైజీ విజయవంతమైతే, అతనిని కెప్టెన్‌గా కూడా చేయవచ్చు.
అయితే, రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలిపెడితేనే అతను వేలంలోకి వస్తాడు. అలా జరగకపోతే ధోని స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కోసం సీఎస్కే చూస్తుంది. బీసీసీఐ ఐదేండ్ల రూల్ ను మారిస్తే ధోని టీమ్ లోనే కొనసాగే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే ఐపీఎల్ 2025 లో ధోని ధనాధన్ బ్యాటింగ్, హెలికాప్టర్ షాట్లను గ్రౌండ్ లో చూడవచ్చు.