Ishan Kishan: గత ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపే ఆటతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అగుగు దూరంలో టైటిల్ ను కోల్పోయింది. అయితే, ఐపీఎల్ 2025 సీజన్ లో ట్రోఫీ గెలిచే టీమ్ గా బరిలోకి దిగింది. కానీ, అనుకున్న విధంగా ఆడటం లేదు.
ఇప్పటి ఈ సీజన్‌లో వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే ప్రతిమ్యాచ్ ను గెలవాల్సిందే. అలాంటి మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఒకరు పిచ్చిపట్టినట్టు చేశాడు. జట్టుతో పాటు అభిమానులకు షాక్ ఇచ్చాడు. వారి నుంచి తీవ్ర అగ్రహానికి గురయ్యాడు.అతనే ఇషాన్ కిషన్.
అవును నిజమే ఇషాన్ కిషన్ అవుట్ కాకుండానే క్రీజు వదిలివెళ్లిపోయాడు. ఒక్కసారిగా ప్రత్యర్థి జట్టుతో పాటు గ్రౌండ్ లో ఉన్నఅభిమానులు కూడా షాక్ అయ్యారు. కొంత సమయం ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి కనిపించింది.
ఐపీఎల్ 2025 41వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ తలపడుతోంది. ఓపెనర్లు ఇద్దరు సింగిల్ డిజిట్ కే అవుట్ అయి పెవిలియన్ కు చేరారు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్ తన వికెట్‌ను ప్రత్యర్థికి అప్పనంగా అప్పగించాడు. అవును అవుట్ కాకుండానే వికెట్ తీసుకోండి అంటూ క్రీజును వదిలాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వచ్చిన బంతిని ఫ్లిక్ చేయబోయి ఎడ్జ్ అయినట్టు అనిపించింది. కానీ అసలు బంతి బ్యాట్‌కు తగలలేదు. ఇషాన్ కిషన్ క్రీజును నుంచి బయటకు వస్తుండటంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు.
ఇక్కడ విచత్రం ఏమిటంటే ముంబై ఆటగాళ్లు అప్పీల్ కూడా చేయలేదు. అంపైర్ వెంటనే అవుట్ ఇవ్వలేదు. అయినా ఇషాన్ తనను ఔట్ అయ్యానని భావించి రివ్యూ తీసుకోకుండా నేరుగా పెవిలియన్ వైపు నడిచాడు. దీంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు.
బ్యాట్ బాల్ తగిలి ఉంటుందని అందరు భావించారు. అందుకే ఇషాన్ కిషన్ క్రీజును వీడాడని ప్రత్యర్థి ఆటగాళ్లు అతడి ఈ స్పోర్ట్స్‌మన్‌షిప్‌ని మెచ్చుకున్నారు. కానీ, రీప్లేలో అతడు నాటౌట్ అని తేలింది. అల్ట్రా ఎడ్జ్‌లో బాల్ బ్యాట్‌ను తాకలేదని స్పష్టంగా కనిపించింది.
Ishan Kishan
దీంతో సన్ రైజర్స్ హైదరాబాడ్ టీమ్ తో పాటు అభిమానులు నిరాశగా కనిపించారు. సోషల్ మీడియాలో పలువురు అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చేశాడు.. ఇదేం ఆటరా?, ఇలా అయితే జట్టు పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో అంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా, ఇషాన్ కిషన్ ఈ ఐపీఎల్ ఎడిషన్ లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టాడు. కానీ, ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయాడు.