Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి.. నా గుండె ముక్కలైంది.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

Published : Apr 23, 2025, 07:08 PM IST

Pahalgam terror attack: కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 28 మందికి పైగ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్ర‌మంలోనే భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందిస్తూ త‌న గుండె ప‌గిలిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

PREV
15
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి.. నా గుండె ముక్కలైంది.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
Pahalgam terror attack: My heart is broken.. These are the reactions of cricketers including Rohit Sharma, Virat Kohli

Pahalgam terror attack: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడిలో 28 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. భారత్ లోని అన్ని రాజకీయ పార్టీలు, అంతర్జాతీయ సమాజం ఏకమై ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా గళం విప్పాయి. ఈ ఘటనపై పలువురు భారత క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దాడి చేసిన వారికి తగిన బుద్ది చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

25
Rohit Sharma, Virat Kohli, and Others Condemn Pahalgam Attack

ప‌హల్గామ్ దాడిని ఖండిస్తూ, మృతులకు సంతాపం తెలిపేందుకు యావత్ క్రికెట్ ప్రపంచం ఏకతాటిపైకి వచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని క్రికెటర్లు సందేశం ఇచ్చారు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, శుభ్ మ‌న్ గిల్, గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, ఆకాశ్ చోప్రా, మనోజ్ తివారీ, యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా సహా పలువురు క్రికెటర్లు దాడిని ఖండించారు.

35
Indian Cricketers React to Pahalgam Terror Attack

పహల్గామ్ ఘటన తీవ్రంగా కలచివేసింది : విరాట్ కోహ్లీ

పహల్గామ్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని విరాట్ కోహ్లీ అన్నాడు. అమాయకులపై దాడులు చేశార‌ని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. "మృతుల కుటుంబాలకు శాంతి, మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్రూరమైన చర్యకు తగిన న్యాయం జరగాలని" కోహ్లీ అన్నాడు. 

ఉగ్రదాడి వెనుక ఉన్న వారికి భారత్ ధీటైన సమాధానం ఇస్తుందని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఉగ్రవాదానికి ధీటుగా బదులివ్వాలని హర్భజన్ సింగ్ డిమాండ్ చేశారు. భారత్ లో ఉగ్రవాదానికి తావులేదని శుభ్ మన్ గిల్ అన్నాడు. "పహల్గామ్ లో జరిగిన దాడి గురించి విని గుండె తరుక్కుపోయింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను" అంటూ గిల్ సోషల్ మీడియాలో వేదిక‌గా స్పందించారు. 

45
Heartfelt Condolences from Cricketers Following Pahalgam Attack

పహల్గామ్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి హింసకు వ్యతిరేకంగా మనం ఏకం కావాలని ఇషాంత్ శర్మ అన్నాడు. పహల్గామ్ లో జరిగిన ఘటన భరించలేనిది, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మనోజ్ తివారీ అన్నారు. 

పహల్గామ్ లో దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందనీ, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పార్థివ్ పటేల్ అన్నారు. పర్యాటకులపై జరిగిన దాడి తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ కష్ట సమయాన్ని అధిగమించే శక్తి బాధిత కుటుంబాలకు కలగాలని ప్రార్థిస్తున్నట్లు యువరాజ్ సింగ్ తెలిపాడు. 

55
Cricket Stars Share Shock and Sympathy After Pahalgam Tragedy

అదే సమయంలో పహల్గామ్ లో జరిగిన ఘటన చాలా భయానకంగా, బాధాకరంగా ఉందని ఆకాశ్ చోప్రా అన్నారు. మృతులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యులను, వారి మద్దతుదారులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
 
పహల్గామ్ ఉగ్రదాడిలో సురేశ్ రైనా పాకిస్థాన్ గురించి నేరుగా ప్రస్తావించాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఈ పిరికిపంద దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు, పారామిలటరీ దళాలతో కలిసి పనిచేస్తున్నానని రైనా తెలిపారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. 

భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందిస్తూ త‌న గుండె ప‌గిలిపోయింద‌ని సందేశాన్ని ఇస్తూ ప‌గిలిన హార్ట్ ఎమోజీని షేర్ చేశారు. కాగా, కాశ్మీర్ ఉగ్రదాడి ఘ‌ట‌న‌పై భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఉగ్ర‌వాదుల కోసం వేట‌ను మొద‌లుపెట్టింది. 

Read more Photos on
click me!

Recommended Stories