డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ మధ్య చల్లారని చిచ్చు... సోషల్ మీడియాలో కూడా ఎస్‌ఆర్‌హెచ్ తీరుపై...

Published : Dec 29, 2021, 06:17 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను సొంత ఫ్రాంఛైజీగా భావించి, అభిమానించి, ఆరాధించాడు డేవిడ్ వార్నర్. అయితే 2021 సీజన్‌లో సీన్ మొత్తం మారిపోయింది... ఆరెంజ్ ఆర్మీ టీమ్ , వార్నర్ భాయ్‌‌ను అన్ని విధాలుగా అవమానించింది...

PREV
111
డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ మధ్య చల్లారని చిచ్చు... సోషల్ మీడియాలో కూడా ఎస్‌ఆర్‌హెచ్ తీరుపై...

సీజన్ ఫస్టాఫ్‌లో ఆరింట్లో ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ను తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం... కేన్ విలియంసన్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించింది...

211

ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి టాప్ స్కోరర్‌గా ఉంటూ, 2016లో కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలిచిన డేవిడ్ వార్నర్‌ను ఏ కారణం చెప్పకుంండా కెప్టెన్సీ నుంచి తప్పించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది...

311

కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత తుదిజట్టులో కూడా డేవిడ్ వార్నర్‌కి ప్లేస్ కరువైంది. ఆఖరికి మ్యాచ్ చూసేందుకు కూడా తనని స్టేడియానికి అనుమతించలేదని వాపోయాడు వార్నర్...

411

ఐపీఎల్‌ 2021లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన డేవిడ్ వార్నర్, ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో అదరగొట్టి, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా గెలిచాడు...

511

అంతేకాకుండా అదే ఫామ్‌ను కొనసాగిస్తూ, యాషెస్ సిరీస్‌లోనూ మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. మూడు టెస్టుల్లో విజయాన్ని అందుకున్న ఆసీస్, ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది...

611

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... మిగిలిన ప్లేయర్లను వేలానికి వదిలేసిన విషయం తెలిసిందే...

711

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ, యాషెస్ సిరీస్‌ గురించి  ‘ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది, ఇంగ్లాండ్ ఇకనైనా లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్తే బెటర్. ఇద్దరు సూపర్ స్టార్లపైనే ఆధారపడడం సరికాదు...’ అంటూ ట్వీట్ చేశాడు...

811

దీనికి ఓ సన్‌రైజర్స్ అభిమాని, ‘మరి సన్‌రైజర్స్ హైదరాబాద్ సంగతేంటి? వేలంలో మంచి ప్లేయర్లను కొనండి ప్లీజ్...’ అంటూ రిప్లై ఇచ్చాడు...

911

ఈ కామెంట్‌కి స్పందించిన డేవిడ్ వార్నర్... ‘హాహా... నాకు డౌటే...’ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌‌ను ప్రత్యేక్షంగానే ట్రోల్ చేశాడు...

1011

వార్నర్ కామెంట్‌కి స్పందించని టామ్ మూడీ, సదరు నెటిజన్‌కి ‘మేం మా వంతుగా బెస్ట్ ప్లేయర్లను కొనడానికి ప్రయత్నిస్తున్నాం...’ అంటూ సమాధానం ఇచ్చాడు...

1111

సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక ఖాతా... వార్నర్ కామెంట్‌కి స్పందించింది. ‘డేవీ... యాషెస్ సిరీస్ గెలిచినందుకు కంగ్రాట్స్... నువ్వు మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టే ఉన్నావు... పార్టీ కూడా ఎంజాయ్ చేస్తున్నావ్... ఐపీఎల్‌లో నీకు కూడా మంచి ధర రావాలని కోరుకుంటున్నాం...’ అంటూ సమాధానం ఇచ్చింది సన్‌రైజర్స్...

click me!

Recommended Stories