‘ఇది మా నాన్న కోసం..!’ మహ్మద్ షమీ భావోద్వేగం... అజింకా రహానే కెప్టెన్సీ ఒక్క మ్యాచ్ కూడా...

Published : Dec 29, 2021, 03:12 PM IST

సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ, టెస్టు కెరీర్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే... ఈ మైలురాయిని అందుకున్న తర్వాత పైకి చేతులు ఎత్తుతూ ఆకాశం వైపు చూసి సెలబ్రేట్ చేసుకున్నాడు షమీ...

PREV
112
‘ఇది మా నాన్న కోసం..!’ మహ్మద్ షమీ భావోద్వేగం... అజింకా రహానే కెప్టెన్సీ ఒక్క మ్యాచ్ కూడా...

2018లో టెస్టుల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న మహ్మద్ షమీ, మూడేళ్ల తర్వాత 2021లో 200 వికెట్లను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు షమీ...

212

భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ 434 వికెట్లతో టాప్‌లో ఉండే, జహీర్ ఖాన్ 311, ఇషాంత్ శర్మ 311, శ్రీనాథ్ 236 టెస్టు వకెట్లతో మహ్మద్ షమీ కంటే ముందు 200+ టెస్టు వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు...

312

మహ్మద్ షమీ తండ్రి తోసిఫ్ ఆలీ 2017లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. టెస్టుల్లో ఐదేసి వికెట్లు తీయడం షమీకి ఆరోసారి...

412

బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రికి నివాళిగా అలా సెలబ్రేట్ చేసుకున్నానంటూ కామెంట్ చేశాడు మహ్మద్ షమీ...

512

‘నా సెలబ్రేషన్స్ మా నాన్నకు నివాళి. ఆయన 2017లో చనిపోయారు. నాకు జన్మనిచ్చిన దగ్గర నా సక్సెస్ చూడాలని కలలు కన్నాడు మా నాన్న...

612

నేను ఈ రోజు సాధించినవాటిల్లో ఏదీ ఆయన లేకపోతే జరిగేవి కావు. నా కోసం ఎంతో చేసిన ఆయనకి క్రెడిట్ ఇవ్వడంలో తప్పేంటి...

712

200 టెస్టు వికెట్లు సాధించడం చాలా ఆనందంగా ఉంది. 100 వికెట్లు తీసినప్పటి కంటే భారత జట్టు తరుపున ఆడుతున్నందుకే నాకు ఎక్కువ గర్వంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ షమీ...

812

ఆడిలైడ్ టెస్టులో 36 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయిన తర్వాత మహ్మద్ షమీ చేతికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే...

912

గాయం కారణంగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరమైన మహ్మద్ షమీ, ఇప్పటిదాకా అజింకా రహానే కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం...

1012

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో 10 టెస్టులు ఆడిన షమీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 45 టెస్టులు ఆడాడు. విరాట్ కెప్టెన్ అయ్యాక 6 టెస్టు మ్యాచులకు దూరం కాగా, ఈ మ్యాచుల్లో షమీ కూడా ఆడలేకపోవడం విశేషం...

1112

గాయం కారణంగా ఆసీస్ టూర్‌లో రహానే కెప్టెన్సీలో జరిగిన మూడు మ్యాచులకు దూరమైన మహ్మద్ షమీ, బిజీ షెడ్యూల్ కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.

1212

2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

click me!

Recommended Stories