ఆ ఆయుధాన్ని అక్కడే వాడాలని అనుకున్నాం... జస్ప్రిత్ బుమ్రా ఎంట్రీపై రవిశాస్త్రి కామెంట్స్...

Published : Dec 29, 2021, 03:52 PM IST

మిగిలిన భారత పేసర్లు స్వదేశాల్లో రాణిస్తూ, విదేశాల్లో ఫెయిల్ అవుతుంటే... జస్ప్రిత్ బుమ్రా స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడడానికి రెండేళ్లకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది...

PREV
19
ఆ ఆయుధాన్ని అక్కడే వాడాలని అనుకున్నాం... జస్ప్రిత్ బుమ్రా ఎంట్రీపై రవిశాస్త్రి కామెంట్స్...

2018 సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు ఆరంగ్రేటం చేసిన జస్ప్రిత్ బుమ్రా, మళ్లీ 2021 సఫారీ టూర్‌లోనే మొదటి వికెట్ తీసి టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు...

29

2016లో టీ20, వన్డే ఆరంగ్రేటం చేసిన జస్ప్రిత్ బుమ్రాని టెస్టుల్లో ఆడించకుండా రెండేళ్ల పాటు అట్టిపెట్టుకుంది భారత జట్టు. సఫారీ సిరీస్‌కి ఎంపికైన  బుమ్రా, ఆ సిరీస్‌లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు...

39

ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, సౌతాఫ్రికా సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో, ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా తరుపున కీలక బౌలర్‌గా మారాడు...

49

‘బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ని పిలిచి, జస్ప్రిత్ బుమ్రాని టెస్టు సిరీస్‌కి రెఢీగా ఉండమని చెప్పాను. ఎప్పుడు పిలుపు వస్తే, అప్పుడు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించా...

59

అప్పటికే విరాట్ కోహ్లీతో సెలక్టర్లతో నేను ఈ విషయం గురించి మాట్లాడాను. అతన్ని స్వదేశంలో ఆడించకూడదని ముందుగానే అనుకున్నాం... 

69

స్వదేశంలో టెస్టు ఆరంగ్రేటం చేయడమే కాదు, కనీసం 15 మంది జట్టులో కూడా ఎంపిక చేయకూడదనేది నా ప్లాన్. నేరుగా ఆ ఆయుధాన్ని సౌతాఫ్రికాలోనే ప్రయోగించాలని అనుకున్నా...

79

కేప్‌ టౌన్‌లో ఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా... నా అంచనాలకు తగ్గట్టుగా రాణించాడు. స్వదేశంలో ఎంట్రీ ఇచ్చి ఉంటే, ఇక్కడి పిచ్‌లకు, విదేశీ పిచ్‌లకీ మధ్య వ్యత్యాసానికి బుమ్రా ఈ స్థాయిలో రాణించేవాడు కాదేమో...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...

89

24 టెస్టుల్లో రెండు సార్లు నాలుగేసి వికెట్లు, ఆరు సార్లు ఐదేసి వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి 101 టెస్టు వికెట్లను పూర్తి చేసుకున్నాడు..

99

2019 వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ తీసి, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మూడో భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా...

Read more Photos on
click me!

Recommended Stories