SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. 9 మంది అవుట్, పాత హీరో మళ్ళీ ఎంట్రీ.. ట్రావిస్ హెడ్‌కు షాక్

Published : Nov 18, 2026, 11:40 AM IST

SRH: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 16 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ సహా 9 మందిని రిలీజ్ చేసింది. హైదరాబాద్ టీమ్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
వేలానికి ముందే మాస్ ప్లాన్ తో రంగంలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2027) మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 16న గోవాలో ఈ గ్రాండ్ వేలం జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను నవంబర్ 17న సమర్పించాయి. గత సీజన్‌లో అంటే ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి టోర్నీ నుంచి అవుట్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), ఈసారి గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. పాత తప్పులను సరిదిద్దుకుని, తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని మేనేజ్‌మెంట్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది.

25
ట్రేడ్ విండోలో ఎస్ఆర్‌హెచ్ దూకుడు

వేలానికి ముందే ట్రేడ్ విండోను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్లుగా వాడుకుంది. ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే ట్రేడ్ విండోలో హైదరాబాద్ టీమ్ చాలా యాక్టివ్‌గా ఉండి, టీమ్ బ్యాలెన్స్‌ను సెట్ చేసుకుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు కీలక డీల్స్ కుదుర్చుకుంది.

జీషన్ అన్సారీని ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంపించి, తమ పాత ప్లేయర్ టీ. నటరాజన్‌ను తిరిగి జట్టులోకి తెచ్చుకుంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో మరో పెద్ద డీల్ సెట్ చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను సీఎస్‌కేకు ఇచ్చి, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను సొంతం చేసుకుంది. అలాగే క్యాష్ డీల్ ద్వారా హర్షల్ పటేల్‌ను గుజరాత్ టైటాన్స్‌కు ట్రేడ్ చేసింది.

35
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న 16 మంది ప్లేయర్లు వీరే

మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 16 మంది ఆటగాళ్లను తమతోనే ఉంచుకోవాలని డిసైడ్ అయ్యింది. యాషెస్ సిరీస్ కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 కు దూరమవుతాడని రూమర్స్ వచ్చినా, మేనేజ్‌మెంట్ మాత్రం అతడిని రిటైన్ చేసుకుంది. స్టార్ ఇండియన్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలను జట్టు అట్టిపెట్టుకుంది. అలాగే జట్టులో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన హెన్రిచ్ క్లాసెన్ కూడా వచ్చే ఏడాది ఆరెంజ్ ఆర్మీ తరఫున బరిలోకి దిగనున్నాడు.

ఎస్ఆర్‌హెచ్ రిటైన్ లిస్ట్: ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరణ్, అనికేత్ వర్మ, ఆర్.ఎస్. అంబరీష్, హర్ష్ దూబే, క్రెయిన్స్ ఫులెట్రా, నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, బ్రైడన్ కార్స్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.

45
ట్రావిస్ హెడ్ సహా 9 మందికి గుడ్‌బై

వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 9 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌లో అందరికీ షాకిచ్చిన పెద్ద పేరు ట్రావిస్ హెడ్. ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున ఆడాల్సిన మ్యాచ్‌లు ఉండటంతో, అతడు ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అందుకే అతడిని రిలీజ్ చేశారు. హెడ్‌తో పాటు స్టార్ పేస్ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, గెరాల్డ్ కోయెట్జీలను కూడా జట్టు వదులుకుంది. వీరందరూ ఇప్పుడు వేలం పూల్‌లోకి వెళ్తారు, అక్కడ ఇతర ఫ్రాంచైజీలు వీరిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ లిస్ట్: ట్రావిస్ హెడ్, కమిందు మెండిస్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మధుశంక, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, శివమ్ మావి, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ పేన్.

55
వేలానికి ముందు సన్‌రైజర్స్ స్క్వాడ్ ఎలా వుందంటే?

వేలానికి ముందే ట్రేడ్ డీల్స్ ద్వారా తమ లోపాలను సరిదిద్దుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టిగా ప్రయత్నించింది. సీఎస్‌కే నుంచి ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఢిల్లీ నుంచి నటరాజన్‌ను తీసుకోవడం ద్వారా పేస్ బౌలింగ్‌ను చాలా స్ట్రాంగ్‌గా మార్చుకుంది. అయితే ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2027 కు దూరం కానుండటంతో, మినీ వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక మంచి విదేశీ ఓపెనర్ కోసం వేట మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనింగ్ చేసిన అనుభవం ఉన్న ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్ స్థానానికి ఒక బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాడు.

ప్రస్తుత సన్‌రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరణ్, అనికేత్ వర్మ, ఆర్.ఎస్. అంబరీష్, హర్ష్ దూబే, క్రెయిన్స్ ఫులెట్రా, నితీష్ కుమార్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, టీ. నటరాజన్, నాథన్ ఎల్లిస్, శివాంగ్ కుమార్, బ్రైడన్ కార్స్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.

Read more Photos on
click me!

Recommended Stories