Ravindra Jadeja: చ‌రిత్ర సృష్టించిన‌ రవీంద్ర జడేజా

Published : May 14, 2025, 10:52 PM IST

Ravindra Jadeja:  టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ రవీంద్ర జడేజా 1,151 రోజులు టెస్ట్ క్రికెట్ లో నెంబ‌ర్.1 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతూ ఐసీసీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు.  

PREV
16
Ravindra Jadeja: చ‌రిత్ర సృష్టించిన‌ రవీంద్ర జడేజా

Ravindra Jadeja: భారత క్రికెట్‌కు ఎంతోకాలంగా సేవలందిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా..  తాజాగా ఒక అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతను 1151 రోజులు వరుసగా నంబర్ 1 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ చరిత్రలో కొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఇది ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరూ సాధించని రికార్డు కావడం విశేషం.

26

జడేజా తన స్థిరమైన ఆటతీరు, బ్యాటింగ్,  బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనలతో భారత జట్టుకు ఎంతోకాలంగా సేవలందిస్తున్నాడు. అనేక విజ‌యాలు అందించాడు. టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక కాలం నెంబ‌ర్ వ‌న్ ఆల్ రౌండర్ గా నిల‌వ‌డంతో జడేజాపై ప్రశంసలు కురుస్తున్నాయి. జడేజా సాధించిన ఈ రికార్డు అతను ప్రపంచంలో గొప్ప ఆల్‌రౌండర్ల జాబితాలో మరింత పైస్థాయికి చేరుకున్నాడని చెప్పవచ్చు.

36

ఇక మరోవైపు, జడేజా భవిష్యత్‌పై కూడా చర్చ జరుగుతోంది. భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు ముగ్గురు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతారా అనే అనుమానాల మధ్య, మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

46

ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ..  “ఈ ముగ్గురు ఆటగాళ్లు వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ అనంతరం తమ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఎక్కువగా ఉంది” అని వ్యాఖ్యానించాడు. “విరాట్, రోహిత్, జడేజా లాంటి స్టార్ ఆటగాళ్లు 2027 వరల్డ్ కప్ వరకు వేచి ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2027 నాటికి ప్రపంచం చాలానే మారిపోతుంది” అని ఆయన అన్నారు.

56

ఈ వ్యాఖ్యలు ఆధారంగా చూస్తే, రవీంద్ర జడేజా త్వరలోనే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించవచ్చని అంచనాలు ఊపందుకున్నాయి. అయినప్పటికీ, జడేజా సాధించిన తాజా రికార్డు భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఘనతగా నిలుస్తుంది.

66

జడేజా టెస్టు క్రికెట్ లో ఇప్పటివరకు 80 మ్యాచ్ లలో 118 ఇన్నింగ్స్ లలో 3370 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే 80 మ్యాచ్ లలో 150 ఇన్నింగ్స్ లలో 323 వికెట్లు తీసుకున్నాడు. 15 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. 3 సార్లు 10 వికెట్లు తీసుకున్న రికార్డులు సాధించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories