స్పిన్ సంగతి తర్వాత, సిరాజ్ మియాను ఎలా ఫేస్ చేయాలో చూడండి... ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ...

First Published Feb 5, 2023, 1:46 PM IST

భారత్‌లో టెస్టు మ్యాచులు అనగానే ముందుగానే అందరికీ గుర్తుకు వచ్చేది స్పిన్ బౌలింగే. 2021లో భారత పర్యటనకి వచ్చిన ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పలు పెట్టారు భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్. ఈసారి ఆస్ట్రేలియా కూడా భారత పర్యటనలో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి గట్టి ప్లానింగ్ వేస్తోంది...

రవిచంద్రన్ అశ్విన్‌ని ఎదుర్కోవడానికి అతని యాక్షన్‌ని పోలి ఉండే మహేశ్ పెథియాని నెట్ బౌలర్‌గా ఎంచుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్, అక్షర్ పటేల్ బౌలింగ్ యాక్షన్‌ని ప్రత్యేకంగా స్టడీ చేస్తోంది. భారత స్పిన్ పిచ్‌లపై కఠోరమైన ప్రాక్టీస్ చేస్తోంది...

‘పాకిస్తాన్‌కి వెళ్లే ముందు స్పిన్ గురించి చాలా చర్చ జరిగింది. అయితే స్పిన్ బౌలింగ్ కంటే అక్కడ రివర్స్ స్వింగ్‌ బౌలింగ్‌ని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. నేను 2018లో ఇండియాలో ఆస్ట్రేలియా ఏ టీమ్ తరుపున ఆడాడు. అప్పుడు కూడా స్పిన్ బౌలింగ్ గురించే ఎక్కువ డిస్కర్షన్ జరిగింది...

అయితే ఫాస్ట్ బౌలర్లే ఎక్కువ ఇబ్బంది పెట్టారు. రివర్స్ స్వింగ్ బాల్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది. గాలేలో రెండు టెస్టు ఆడాడు. అక్కడ రెండు పిచ్‌లు ప్రత్యేకమైనవి. ఆ పిచ్‌ చూసి స్పిన్‌కి బాగా అనుకూలిస్తుందని అనుకున్నాం. కానీ జరిగింది వేరు...
 

Umesh Yadav

ఇండియాలో పిచ్‌లపై ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లను ఎదుర్కోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సీనియర్ మహ్మద్ షమీ కూడా చాలా డేంజరస్ బ్యాటర్. టీమ్ మీటింగ్‌లో స్పిన్ బౌలింగ్ గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. అయితే మా స్పిన్నర్లు కూడా బాగానే వేస్తారు...

Alex Carey

ఈ టెస్టు సిరీస్ మాతో పాటు ఇండియాకి కూడా చాలా అవసరం. వాళ్లు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే మేం కూడా తక్కువ తినలేదు, ఈసారి ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతోనే అన్ని అస్త్రాలతో బరిలో దిగుతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ...

click me!