నీ కంటే రవిచంద్రన్ అశ్విన్ 100 రెట్లు నయం... హర్భజన్ సింగ్‌పై ట్రోల్స్! కారణం ఏంటంటే...

First Published Feb 5, 2023, 12:38 PM IST

టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్ హర్భజన్ సింగ్. ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ తీశాడు హర్భజన్ సింగ్. అయితే హర్భజన్ సింగ్‌ని రవిచంద్రన్ అశ్విన్‌తో పోల్చి చూస్తూ, ట్రోల్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు. దీనికి కారణం హర్భజన్ సింగ్, ఇన్‌డైరెక్ట్‌గా అశ్విన్‌ని ట్రోల్ చేయడమే...

2004 తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్ గెలవలేకపోయింది ఆస్ట్రేలియా. ఈసారి ఎలాగైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఇండియాలో అడుగుపెట్టింది ఆసీస్... ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ని ఇబ్బంది పెట్టే భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం అతని బౌలింగ్‌ యాక్షన్‌ని పోలి ఉండే యంగ్ బౌలర్ మహేశ్ పెథియాని నెట్ బౌలర్‌గా నియమించుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా...
 

Ashwin

ఇండియాతో టెస్టు సిరీస్‌కి ముందు అశ్విన్‌‌ని ఫేస్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా సిద్ధమవుతోంది. అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌కి కార్బన్ కాపీలా ఉండే యంగ్ బౌలర్‌‌ని నెట్ బౌలర్‌గా పెట్టుకున్నారంటూ క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది...

Ravichandran Ashwin

దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన స్టైల్‌లో స్పందించాడు. ‘తొలి టెస్టుకి ఇంకా 5 రోజుల సమయం ఉంది. ఇప్పటికే అశ్విన్, ఆస్ట్రేలియా బుర్రలోపలికి వెళ్లపోయినట్టు ఉన్నాడు..’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు వసీం జాఫర్...

వసీం జాఫర్ చేసిన ట్వీట్‌కి హర్భజన్ సింగ్ స్పందించిన విధానం హాట్ టాపిక్ అయ్యింది. ‘అశ్విన్ కాదు, ఇది వారి బుర్రల్లో ఎక్కువగా ఉంది...’ అంటూ భారత్‌లోని పగుళ్లు తేలిన పిచ్ ఫోటోను పోస్ట్ చేశాడు హర్భజన్ సింగ్. ఓ రకంగా అశ్విన్‌ని మాత్రమే కాదు, బీసీసీఐని కూడా ట్రోల్ చేశాడు హర్భజన్ సింగ్...

మిగిలిన భారత స్పిన్నర్ల మాదిరిగానే రవిచంద్రన్ అశ్విన్, విదేశాల్లో కంటే స్వదేశంలోనే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ కూడా ఇదే విధంగా విదేశాల్లో కంటే స్వదేశంలో ఎక్కువ వికెట్లు తీశారు. అయితే హర్భజన్ సింగ్ మాత్రం అశ్విన్ కేవలం భారత స్పిన్ పిచ్‌లపై మాత్రమే బాగా ఆడతాడనే ఉద్దేశంలో ఈ ట్వీట్ చేసినట్టు ఉంది...
 

Image credit: Getty

దీంతో భారత అభిమానులు, హర్భజన్ సింగ్‌ని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అశ్విన్, ఆస్ట్రేలియా జట్టుని ఎంత భయపెడుతున్నాడో తెలీదు కానీ హర్భజన్ సింగ్‌ని బాగా భయపెడుతున్నాడు. భజ్జీ రికార్డులను అశ్విన్ తుడి చేశాడని, అతన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు.. అందుకే ఇలా కామెంట్లు చేస్తున్నాడని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు...

ఇలాంటి వారిని టీమ్‌లో నుంచి తీసేసి మహేంద్ర సింగ్ ధోనీ మంచి పని చేశాడని, ఓ భారత క్రికెటర్ తన రికార్డులు తుడిచేస్తుంటే చూసి తట్టుకోలేని హర్భజన్ సింగ్, టీమ్‌లో ఉండడానికి నిజంగానే అర్హుడు కాదని కామెంట్లు పెడుతున్నారు మరికొందరు.. 

click me!