భారత జట్టు తరఫున సచిన్, కాంబ్లీలు దాదాపు ఒకే సమయంలో అరంగేట్రం చేశారు. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ.. తన వ్యవహారశైలితో టీమ్ లో చోటు కోల్పోయాడు. ఆట నుంచి తప్పుకున్నాక సినిమాల్లో యత్నించి అక్కడా సక్సెస్ కాకపోవడంతో కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ముంబై క్రికెట్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు.