ధోనీని చూసినప్పుడు, వీడు బ్యాటింగ్ చేస్తాడా అనుకున్నా... బ్యాటింగ్ రాకపోయినా బిల్డప్‌కేం తక్కువలేదు...

Published : Jun 08, 2021, 01:23 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌లో ఉంటే, ఎలాంటి బౌలర్‌కైనా చుక్కలు కనిపించాల్సిందే. అలాంటి మాహీని చూసి... వీడేంటి ఇలా ఉన్నాడు, బ్యాటింగ్ చేయగలడా? అనుకున్నాడట సౌతాఫ్రికా యంగ్ పేసర్ ఆన్రిచ్ నోకియా. 11 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు ఈ సఫారీ బౌలర్...

PREV
110
ధోనీని చూసినప్పుడు, వీడు బ్యాటింగ్ చేస్తాడా అనుకున్నా... బ్యాటింగ్ రాకపోయినా బిల్డప్‌కేం తక్కువలేదు...

‘మొదటిసారి 2010 ఛాంపియన్స్ లీగ్‌ టీ20లో నేను సీఎస్‌కేకి నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. సౌతాఫ్రికాలో జరిగిన సిరీస్ అది. అప్పుడు నాకు 16 ఏళ్లు ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్‌ నన్ను నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి పిలిచింది...

210

నెట్స్‌లో ఓ బ్యాట్స్‌మెన్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు నేనింకా చిన్నపిల్లాడినే. ఎవ్వరికీ భయపడేవాడిని కాదు. నా వయసు అలాంటిది. అంతేకాదు అప్పుడు నా బౌలింగ్‌లో ఇంత స్పీడ్ కూడా లేదు...

310

నెట్స్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను నేను గుర్తుపట్టలేదు. బౌలింగ్ వేయమన్నారు కదా అని రెండు బాల్స్ వేశా... నేను వేసిన రెండు బాల్స్‌ను కాలు కదపకుండా, అలా నిలబడి స్టేడియం బయటకి పంపేశాడు...

410

ప్రాక్టీస్ చూడడానికి వచ్చిన కొందరు అభిమానులు... ఆ షాట్స్ చూసి.. ‘ధోనీ... ధోనీ’ అంటూ అరవడం మొదలెట్టారు. అప్పుడే అతను మాహీ అని అర్థమైంది. కాలికి గాయమైనా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు... మాహీ చాలా మంచి మనిషి.

510

అందర్నీ ప్రేమగా పలకరిస్తారు. మన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. నిజం చెప్పాలంటే మొదటిసారి చూసినప్పుడు అతని స్టైల్ చూసి, బ్యాటింగ్ చేయడానికి రాకపోయినా బిల్డప్‌కి ఏం తక్కువ లేదని అనుకున్నా... కానీ మాహీ మన కళ్లలోకి చూస్తూ, తన ఆటతో మన కళ్లు తెరిపిస్తాడు... ’ అంటూ చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా యంగ్ పేసర్ ఆన్రిచ్ నోకియా.

610

2010 ఛాంపియన్స్ లీగ్ టీ20లో చెన్నై సూపర్ కింగ్స్, వారియర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ అందుకుంది. ఈ లీగ్‌లో ధోనీ 5 ఇన్నింగ్స్‌ల్లో 91 పరుగులు చేశాడు....

710

అదే ఏడాది ఐపీఎల్ 2010 టైటిల్ కూడా గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, ఒకే ఏడాది రెండు టీ20 లీగ్స్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు.

810

2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున 16 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన నోకియా, 2021 సీజన్ ఆరంభానికి ముందు కరోనా బారిన పడడంతో లీగ్‌లో జరిగిన 8 మ్యాచుల్లో బరిలో దిగలేదు.

910

సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్‌లో నోకియా ఆడే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌కి ముందు జరిగే ఐపీఎల్ 2021 సీజన్‌కి తమ ప్లేయర్లను పంపేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇప్పటికే అంగీకారం తెలిపింది. 

1010

కరోనా కారణంగా లీగ్‌కి బ్రేక్ పడే సమయానికి 6 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్‌లో ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ 5 విజయాలతో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories