క్యాచ్ ప్రాక్టీస్ చేస్తుంటే, మూతి పగిలింది... ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెన్ డంక్‌కి గాయం, పెదవికి 7 కుట్లు...

First Published Jun 8, 2021, 12:21 PM IST

పాక్ సూపర్ లీగ్ ఇంకా ప్రారంభం కాకముందే, ఆటగాళ్లు గాయాల బారిన పడడం మొదలైంది. పీఎస్ఎల్‌లో పాల్గొనేందుకు నెట్ ప్రాక్టీస్‌ చేస్తున్న బెన్ డంక్, ప్రాక్టీస్ సమయంలో క్యాచ్ అందుకోబోయి తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వచ్చిన బంతి, నేరుగా మూతికి తగలడంతో పెదవి చిట్టిపోయి, 7 కుట్లు వేయాల్సి వచ్చింది...

జూన్ 9 నుంచి తిరిగి ప్రారంభం అవుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనేందుకు అబుదాబీ వచ్చిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెన్ డంక్, లాహోర్ ఖలందర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు.... లీగ్ ప్రారంభానికి రెండు రోజులే ఉండడంతో నిన్న ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమించారు లాహోర్ ఖలందర్స్ జట్టు సభ్యులు.
undefined
ఈ సమయంలో వికెట్ కీపర్‌గా వ్యవహారిస్తున్న బెన్ డంక్, క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ బంతిని అందుకునే క్రమంలో అది తృటిలో మిస్ అయి మూతికి తగలింది. ఈ గాయంతో అతని పెదవులు చిట్లిపోయి, తీవ్ర గాయమైంది...
undefined
అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, సర్జరీ నిర్వహించిన వైద్యులు బెన్ డంక్‌ పెదవికి 7 కుట్లు వేశారు. బంతి బలంగా తగలడంతో అతని పెదవి చిట్లిపోయింది. దాన్ని యథాస్థానంలో అతికించినా... అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు వైద్యులు.
undefined
‘బుర్జిల్ ఆసుపత్రిలోని నర్సులకు, సర్జర్లను ధన్యవాదాలు. నా పెదవిని అతికించి, నా ఆశలను చచ్చిపోకుండా కాపాడారు...’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు బెన్ డంక్.
undefined
ఆస్ట్రేలియా జట్టు తరుపున 5 టీ20 మ్యాచులు ఆడిన 34 ఏళ్ల బెన్ డంక్, అక్కడ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో విదేశీ లీగుల్లో పాల్గొంటున్నాడు. బెన్ డంక్‌కి గాయం కావడంతో ఆస్ట్రేలియా జట్టు మరోసారి ఉలిక్కిపడింది.
undefined
ఇంతకుముందు ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, మైదానంలో క్రికెట్ ఆడుతూ బౌన్సర్ బలంగా తగలడంతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి ఇంకా ఆస్ట్రేలియా జట్టు పూర్తిగా కోలుకోలేదు...
undefined
అయినా క్యాచ్ ప్రాక్టీస్ చేస్తుంటే, బంతి అంత వేగంగా ఎలా వచ్చిందనేది అనుమానంగా మారింది. బలంగా విసిరితే తప్ప, బంతి తగిలే వేగానికి పెదవి చిట్లిపోయేంత గాయం కాదని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..
undefined
click me!