హనుమ విహారి సాయంతో నిలిచిన ప్రాణం... వైజాగ్‌లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతికి...

First Published Jun 8, 2021, 11:49 AM IST

ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి ఆటకంటే ఎక్కువగా తన గొప్ప మనసుతో అందరి మనసు గెలుచుకుంటున్నాడు. కరోనా కష్ట కాలంలో తన బృందంతో కలిసి అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్‌లు ఏర్పాటు చేసిన హనుమ విహారి, ఇప్పుడు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు...

ఆంధ్రప్రదేశ్ విశాఖలో ఓ యువకుడు, తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ప్రియాంక అనే యువతిపై దాడి చేశాడు. కత్తి తీసుకుని, ప్రియాంక గొంతు కోసి హత్యాయత్నం చేశాడు...
undefined
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకకు వెంటనే ఆపరేషన్ చేయాలని, అందుకోసం దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు వైద్యులు. అయితే ప్రియాంక తల్లిదండ్రుల వద్ద అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో సాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు.
undefined
విషయం తెలుసుకున్న క్రికెటర్ హనుమ విహారి, తన టీమ్ ద్వారా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్మొదలెట్టారు. అయితే ఫండ్ రైజింగ్ ద్వారా డబ్బులు రావడానికి సమయం పడుతుందని భావించిన విహారి, తక్షణ సాయంగా తన ఖాతాలో నుంచి రూ.5 లక్షలు ఆపరేషన్ కోసం చెల్లించాడు.
undefined
ఈ విషయం సాయం అందుకున్న ప్రియాంక స్నేహితులు చెప్పేవరకూ బయటి ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ, ఆ విషయాన్ని పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడని హనుమ విహారి లాంటివాళ్లు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు అంటూ పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు...
undefined
ఐపీఎల్‌లో చోటు దక్కకపోవడంతో ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న హనుమ విహారి, ఓ వైపు ఆ మ్యాచుల్లో పాల్గొంటూనే ఖాళీ సమయాల్లో ఇక్కడివారికి సాధ్యమైన సహాయ ఏర్పాట్లను చూసుకున్నారు.
undefined
ప్రస్తుతం ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న హనుమ విహారి, సోషల్ మీడియా ద్వారా కరోనా సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి చేతనైన సాయాన్ని అందిస్తున్నారు.
undefined
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ... ఇలా 11 మంది ప్లేయర్లతో జట్టు పటిష్టంగా ఉండడంతో విహారికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.
undefined
click me!