IND vs SA: సౌతాఫ్రికాను దెబ్బ‌కొట్టి... మహ్మద్ సిరాజ్ స‌రికొత్త రికార్డు

First Published | Jan 3, 2024, 4:45 PM IST

South Africa vs India, 2nd Test Live: భార‌త్-సౌతాఫ్రికా రెండో టెస్టులో భార‌త బౌల‌ర్లు అద‌ర‌గొట్టడంతో 55 ప‌రుగుల‌కే ద‌క్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. 6 వికెట్లు తీసుకున్న మ‌హ్మ‌ద్ సిరాజ్ త‌న కెరీర్ లోనే అత్యుత్త‌మ గ‌ణాంకాల‌తో పాటు స‌రికొత్త రికార్డులు సృష్టించాడు.
 

Mohammed Siraj

South Africa vs India, 2nd Test: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జ‌రుగుతున్న‌ భార‌త్ vs ద‌క్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు భార‌త పేసర్ల అద్భుత బౌలింగ్ తో సౌతాఫ్రికాను దెబ్బ‌కొట్టారు. మ‌న బౌల‌ర్లు నిప్పులు చెరగ‌డంతో సౌతాఫ్రికా జ‌ట్టు 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 
 

సౌతాఫ్రికాను 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చ‌డంలో మ‌హ్మ‌ద్ సిరాజ్ కీల‌క పాత్ర పోషించాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్ 6 వికెట్లు తీసుకుని స‌ఫారీ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు. జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ లు చెరో రెండు వికెట్లు తీశారు. తొలి రోజు లంచ్ సమయానికి సిరాజ్ దెబ్బ‌తో ప్రొటీస్ జ‌ట్టు కుప్ప‌కూలింది.


సిరాజ్ ఈ మ్యాచ్ లో త‌న కెరీర్ బెస్ట్ గ‌ణాంకాలు న‌మోదుచేశాడు. 9 ఓవర్లు వేసిన మ‌హ్మ‌ద్ సిరాజ్ 15 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. స్వింగ్, సీమ్, కచ్చితత్వంతో బౌలింగ్ వేసి సౌతాఫ్రికా ప‌త‌నాన్ని సిరాజ్ శాసించాడు. స‌రికొత్త రికార్డును సృష్టించాడు. 
 

Mohammed Siraj

మహ్మద్ సిరాజ్ కెరీర్ బెస్ట్ గణాంకాలు గమనిస్తే.. ఇప్పటివరకు మూడు సార్లు విదేశీ గడ్డపై ఐదు వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ టెస్టు మ్యాచ్ లో 9 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.సిరాజ్ కెరీలో ఇప్పటివరకు ఇదే బెస్ట్ బౌలింగ్. 
 

విదేశాల్లో సిరాజ్ అత్యధిక వికెట్లు తీసుకున్న గణాంకాలు గమనిస్తే.. సౌతాఫ్రికా గడ్డపై 5-15 (2024), వెస్టిండీస్ పై 5-60 (2023), ఆస్ట్రేలియాపై 5-73 (2021), ఇంగ్లాండ్ పై 4-32 (2021), ఇంగ్లాండ్ పై 4-66 (2022) టాప్-5 లిస్టులో ఉన్నాయి. 
 

Latest Videos

click me!