Ind Vs SA: సిరీస్ లో టీమిండియాను ఎలా పడగొట్టామంటే..! కీలక విషయాలు వెల్లడించిన సఫారీ సారథి

Published : Jan 16, 2022, 05:38 PM IST

India Vs South Africa: ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన  టీమిండియాకు డీన్ ఎల్గర్ సారథ్యంలోని సఫారీలు భారీ షాకిచ్చారు. వరుసగా రెండు టెస్టులలో ఓడించి సిరీస్ ను చేజిక్కించుకున్నారు.

PREV
19
Ind Vs SA: సిరీస్ లో టీమిండియాను ఎలా పడగొట్టామంటే..! కీలక విషయాలు వెల్లడించిన సఫారీ సారథి

ఇటీవలే టీమిండియాతో ముగిసిన టెస్టు సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో భారత్ గెలిచినా తర్వాత అనూహ్యంగా పుంజుకున్న సౌతాఫ్రికా.. తర్వాత రెండు టెస్టులలో నెగ్గి సిరీస్ ను నిలబెట్టుకుంది.

29

అయితే దక్షిణాఫ్రికా సిరీస్  విజయం  ఎలా సాధించిందనేవిషయమై ఆ జట్టు సారథి డీన్ ఎల్గర్ కీలక విషయాలు వెల్లడించాడు. జట్టు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తో కలిసి టీమిండియాను ఓడించడానికి వేసిన ఎత్తుగడలను వివరించాడు. 

39

సిరీస్ విజయం అనంతరం స్థానిక మీడియాతో ఎల్గర్ మాట్లాడుతూ.. ‘నేను  జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు  సరైన సవాళ్లను విధించాను.  టీమ్ లో వారు సరిగ్గా రాణిస్తేనే కుర్రాళ్లు కూడా వారిని అనుసరిస్తారు. ఈ సందేశాన్ని వారిలో గట్టిగా చొప్పించాను. 

49

ఈ సిరీస్ కు ముందు టీమిండియాను ఫేవరేట్ గా దక్షిణాఫ్రికాను అండర్ డాగ్స్ గా పరిగణించారు. అది నాలో కసిని ప్రేరేపించింది.  నా జట్టు ఇంకా  బాగా ఆడటానికి దారితీసింది.

59

తొలి టెస్టులో ఓటమి తర్వాత నేను, మార్క్ బౌచర్ తో కలిసి జట్టుతో ఓ సమావేశం ఏర్పాటుచేశాం. జరిగిన పరిణామాల గురించి పెద్దగా బాధపడకుండా  రాబోయే రెండు టెస్టుల గురించే ఆలోచించాం. 
 

69

అందులో భాగంగానే  ప్రతి ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడాను. వాళ్లందరికీ వారి సామర్థ్యం మేరకు పనులు అప్పగించాను. ఇది పాత పద్దతే అయినా ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు రాబట్టాలంటే ఇలాంటివి పాటించక తప్పదు. 

79

కఠిన పరిస్థితుల్లో నిలబడటానికి వీలుగా ఆటగాళ్లందరిలోనూ నేను, బౌచర్ వారికి ధైర్యం నింపాము. ఇక మేము మా ఆటగాళ్లకు ఇచ్చిన పనిని వాళ్లు పూర్తి నిబద్ధతతో నిర్వర్తించారు.  సీనియర్లే గాక కుర్రాళ్లు కూడా అద్భుతంగా స్పందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది..’ అని ఎల్గర్ అన్నాడు. 

89

ఇక సిరీస్ లో టర్నింగ్ పాయింట్ ఏమిటని ఎల్గర్ ను ప్రశ్నించగా అతడు సమాధానం చెబుతూ.. ‘రెండో టెస్టులో రహానే, పుజారాలను ఔట్ చేయడం ఆ టెస్టులో  కీలక మలుపు.  వాండరర్స్ టెస్టులో కగిసో రబాడా స్పెల్ నిజంగా ప్రత్యేకం. అతడు తక్కువ సమయంలోనే భారత్ ను పడగొట్టి  మాకు విజయాన్ని అందించాడు..’ అని తెలిపాడు. 
 

99

వాండరర్స్ లో సాధించిన విజయాన్ని  కేప్టౌన్ లో కూడా కొనసాగించడం అద్భుతంగా ఉందని, ఇది తమ కుర్రాళ్ల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని ఎల్గర్ హర్షం వ్యక్తం చేశాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories