కొత్త టెస్టు కెప్టెన్‌కి అసలైన సమస్యే అప్పుడే... విదేశాల్లో సిసలైన ఛాలెంజ్ గెలిస్తేనే...

First Published Jan 16, 2022, 4:52 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు విదేశాల్లో టెస్టు సిరీస్‌లను ఫుల్లుగా ఎంజాయ్ చేశారు టీమిండియా ఫ్యాన్స్. న్యూజిలాండ్ టూర్ మినహా ఆ తర్వాత, అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో, ఇంగ్లాండ్ టూర్‌లో అదరగొట్టింది విరాట్ సేన...

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కేవలం ఓ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే జట్టుకి అందుబాటులో ఉండబోతున్నాడు...

వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది భారత జట్టు. స్వదేశంలో అది కూడా పెద్దగా ఫామ్‌లో లేని శ్రీలంక జట్టును టెస్టుల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు...

రోహిత్ శర్మ లేదా కెఎల్ రాహుల్, లేదా రిషబ్ పంత్... టీమిండియా తర్వాతి టెస్టు కెప్టెన్‌ ఎవ్వరైనా శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో జట్టును నడిపించడంలో పెద్ద ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు...

ఆ తర్వాత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో కలిసి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది భారత జట్టు. నాలుగు టెస్టుల ఈ సిరీస్ కూడా ఈసారి స్వదేశంలోనే జరగనుంది... ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడుతుంది...

ఎలా చూసుకున్నా ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో నయా సారథికి చెప్పుకోదగ్గ ఛాలెంజ్‌లు ఏమీ ఉండవు...

అయితే వచ్చే ఏడాది ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి విదేశాల్లో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంటుంది భారత జట్టు...

అక్కడే భారత జట్టు నయా టెస్టు సారథికి అసలు సిసలైన ఛాలెంజ్ ఎదురుకానుంది. విదేశీ పిచ్‌లపై భారత జట్టును విజయపథంలో నడిపించడం అంత తేలికయ్యే విషయం కాదు...

స్వదేశంలో సూపర్ సక్సెస్ అయిన రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ వంటి కెప్టెన్లు కూడా విదేశాల్లో విజయాలు అందుకోలేకపోయారు...

విరాట్ కోహ్లీకి స్వదేశంలో, విదేశాల్లోనూ బీభత్సమైన రికార్డు ఉంది. కోహ్లీ కెప్టెన్సీలో స్వదేశంలో ఒక్కటంటే ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు టీమిండియా. వరుసగా 11 టెస్టు సిరీసుల్లోనూ విజయాలు అందుకుంది...

విదేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగా ఉన్న విరాట్ కోహ్లీకి వారసుడిగా వచ్చే నయా సారథి... విదేశీ పిచ్‌లపై జట్టును ఎలా నడిపిస్తాడనేదనేది ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌ను కలవరబెడుతున్న విషయం...

click me!