‘దక్షిణాఫ్రికా కూడా ఇంగ్లాండ్ లోనే ఉంది.. ఇండియాతో కలిసి ట్రై సిరీస్ ఆడితే ఆ మజానే వేరు..’

Published : Jul 14, 2022, 10:31 PM IST

ENG vs IND: క్రికెట్ ఆడే పెద్ద దేశాలలో ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ లలో ఈ ఆటమీద క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఇక ఈ మూడు జట్లు ట్రైసిరీస్ ఆడితే..   

PREV
17
‘దక్షిణాఫ్రికా కూడా ఇంగ్లాండ్ లోనే ఉంది.. ఇండియాతో కలిసి ట్రై సిరీస్ ఆడితే ఆ మజానే వేరు..’
Image credit: Getty

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్  పర్యటనలో ఉంది. ఇంగ్లాండ్ తో అక్కడ  టెస్టు, టీ20 లు ముగియడంతో వన్డే సిరీస్ ఆడుతున్నది. ఈనెల  17 వరకు సిరీస్ ముగియనుండగా 19 వరకు రోహిత్ సేన ఇంగ్లాండ్ లోనే ఉంటుంది.  

27
Image credit: PTI

భారత్ తో పాటే దక్షిణాఫ్రికా కూడా ఇంగ్లాండ్ లోనే ఉంది. ఇండియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో సఫారీలు  మూడు ఫార్మాట్లలో మ్యాచులు ఆడాల్సి ఉంది.  ప్రస్తుతం దక్షిణాఫ్రికా అక్కడ ఇంగ్లాండ్-ఎ తో  ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతున్నది. 

37
Image credit: Getty

మరి ఈ మూడు జట్లు కలిసి ట్రై సిరీస్ ఆడితే..? ప్రపంచంలోనే టాప్-3 జట్ల మధ్య ముక్కోణపు సిరీస్.. పేరువింటేనే క్రికెట్ అభిమానులకు ఊహించిన ఫన్ కళ్లముందు కదలాడుతున్నది. టీమిండియా మాజీ ఓపెనర్ , ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు  వసీం జాఫర్ కు కూడా ఇదే  ఆలోచన వచ్చింది.  
 

47
Image credit: Wikimedia Commons

తాజాగా అతడు ట్విటర్ వేదికగా ఇదే విషయమై ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘సౌతాఫ్రికా ఇంగ్లాండ్ లోనే ఉంది. వాళ్ల వన్డే సిరీస్ జులై 19న మొదలుకానుంది.  ఇంగ్లాండ్-ఇండియా సిరీస్ 17న ముగుస్తుంది. అసలు ఈ మూడు జట్లు కలిసి  ముక్కోణపు సిరీస్ ఆడితే అది మంచి సిరీస్ అవుతుంది. 

57

మ్యాచ్ ఆడే టీమ్స్ తో పాటు చూసే ఫ్యాన్స్ కు కూడా  ఎనలేని కిక్కు దక్కుతుంది’ అని రాస్తూనే ద్వైపాక్షిక సిరీస్ ల కంటే  ముక్కోణపు సిరీస్ బెటర్ అని అర్థం వచ్చేలా  ట్వీట్ లో పేర్కొన్నాడు. 

67

జాఫర్ ట్వీట్ కు అభిమానులు కూడా  ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచంలోనే  మేటి జట్లుగా పేరున్న ఇండియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ కలిసి ఆడితే  బాగుంటుందని.. అసలైన క్రికెట్  మజా దక్కుతుందని కామెంట్ చేస్తున్నారు. 

77

టీ20ల యుగం మొదలై దేశానికో లీగ్ ఆడుతున్నప్పట్నుంచి ద్వైపాక్షిక సిరీస్ లు ఐసీసీ టోర్నీలు మినహా ముక్కోణపు సిరీస్ లకు మోక్షం రావట్లేదు. ఈ మధ్య  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఇండియా-పాకిస్తాన్-ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్  కలిపి క్వాడ్రపుల్ (నాలుగు దేశాలు) సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదించినా ఐసీసీ దానికి అంగీకారం తెలపలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories