బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీకి బ్రిటన్ పార్లెమెంట్ లో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ పార్లమెంట్ గంగూలీని సత్కరించింది. ఈ విషయాన్ని స్వయంగా దాదానే వెల్లడించాడు.
27
natwest
తాజాగా ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. ‘అవును. బ్రిటీష్ పార్లమెంట్ నన్ను సత్కరించింది. ఇందుకు ఒక బెంగాలీగా గర్వపడుతున్నా. ఈ సన్మానం కోసం వాళ్లు నన్ను ఆరు నెలల కిందే సంప్రదించారు.
37
బ్రిటన్ పార్లమెంట్ లో ప్రతి ఏడాది ఇలా ఒకరిని సత్కరిస్తారు. ఈసారికి ఆ అవకాశం నాకు దక్కింది’ అని గంగూలీ తెలిపాడు. ప్రస్తుతం గంగూలీ తన పుట్టినరోజుకు లండన్ కు వెళ్లి ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచులను వీక్షిస్తూ అక్కడే గడుపుతున్నాడు.
47
గంగూలీ.. భారత సారథిగా ఇంగ్లాండ్ గడ్డ మీద ప్రముఖ నాట్వెస్ట్ ట్రోఫీ (జులై 13న) సాధించి 20 ఏండ్లైన సందర్భంగా దాదాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది.
57
2002 జులై 13న భారత జట్టు గంగూలీసారథ్యంలో లార్డ్స్ లోఅద్భుతం చేసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
67
ఈ మ్యాచ్ లో యువరాజ్ (69), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్) ల అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టుకు చిరస్మరణీయ విజయం దక్కింది. మరో 3 బంతులు మిగిలుండగానే టీమిండియా విజయాన్ని ముద్దాడింది.
77
ఇక ఈ మ్యాచ్ లో విజయం తర్వాత దాదా.. షర్ట్ విప్పేసి చేసుకున్న విజయోత్సవాలు అంతాఇంతా కాదు. భారత క్రికెట్ గురించి మాట్లాడుకున్నన్ని రోజులు లార్డ్డ్స్ విజయం గురించి మాట్లాడాల్సిందే అన్నంతగా క్రికెట్ అభిమానుల్లో చెరగని ముద్రవేసింది ఈ విజయం.