విరాట్ కోహ్లీ మామూలోడు కాదు, మూడేళ్ల క్రితం ఆ మాట అన్నాడు, చేసి చూపించాడు... - సౌతాఫ్రికా మాజీ క్రికెటర్...

First Published Dec 24, 2021, 9:34 AM IST

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాను విరాట్ కోహ్లీ నడిపించే విధానం, క్రికెట్ విశ్లేషకులను ఫిదా చేసేసింది. తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ అలెన్ డోనాల్డ్‌ కూడా కోహ్లీ కెప్టెన్సీని ప్రశంసల్లో ముంచెత్తాడు..

2013 నుంచి స్వదేశంలో పరాజయం లేకుండా వరుసగా 14 టెస్టు సిరీస్‌లను గెలుస్తూ వస్తోంది భారత జట్టు. ఈ నెల ఆరంభంలో న్యూజిలాండ్‌ను కూడా చిత్తు చేసి, టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో గెలిచింది టీమిండియా..

అయితే స్వదేశాల్లో అద్భుత విజయాలు అందుకుంటున్నా, విదేశాల్లో మాత్రం చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయింది భారత జట్టు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా అయ్యాక, సీన్ మారిపోయింది...

బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి జట్లను వారి గడ్డపైనే ఓడించిన టీమిండియా, ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీసుల్లో ఆసీస్‌ గడ్డపైనే చిత్తు చేసి దుమ్మురేపింది...

ఇంగ్లాండ్‌లోనూ నాలుగు టెస్టుల్లో 2-1 తేడాతో ఆధిక్యం అందుకున్న భారత జట్టు, కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టును వచ్చే ఏడాదిలో ఆడనుంది...

‘మూడేళ్ల క్రితం విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సౌతాఫ్రికాలో 2-1 తేడాతో టెస్టు సిరీస్ ఓడిపోయిన తర్వాత విదేశాల్లో విజయాలు అందుకోలేకపోతే, టాప్ టీమ్‌ అనిపించుకోలేం, అందుకే ఇకపై దానిపైనే ఫోకస్ పెడతాం... అన్నాడు విరాట్ కోహ్లీ...

చెప్పినట్టుగానే విదేశాల్లో విజయాలు అందుకోవడానికి అవసరమైన దినుసులన్నీ విరాట్ కోహ్లీ సమకూర్చుకున్నాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించిన భారత జట్టు, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా అర్హత సాధించింది....

ఇప్పుడు భారత జట్టును ఓడిస్తే, సౌతాఫ్రికా బ్రాండ్ ఏంటో ప్రపంచానికి తెలియచేసినట్టు అవుతుంది. మేం ఈ సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం...

గత పర్యటనతో పోలిస్తే, ఈసారి భారత జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఆ టీమ్‌లో చాలామంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే సౌతాఫ్రికా తక్కువేమీ కాదు....

మా జట్టులోనూ మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు, అదరగొట్టే బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారు. గత సీజన్‌లో కొత్త మంది కీ ప్లేయర్లు జట్టుకి దూరమయ్యారు...

అందుకే ఇప్పుడు సౌతాఫ్రికాలో కొందరు యువ ఆటగాళ్లు ఉన్నమాట వాస్తవమే, అయితే వారిలో టాలెంట్‌కి కొదువేమీ లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ అలెన్ డోనాల్డ్..

click me!