IPL Auction Date: నిన్నో మాట..! నేడో మాట..!! ఇంతకీ ఐపీఎల్ మెగా వేలమెప్పుడు..?

Published : Dec 23, 2021, 03:50 PM ISTUpdated : Dec 23, 2021, 03:53 PM IST

IPL Mega Auction 2022: క్యాష్ రిచ్ లీగ్  ఐపీఎల్ లో  వచ్చే ఏడాది జరుగబోయే సీజన్ కోసం వేలాన్ని ఎప్పుడు నిర్వహిస్తారా..? అనే విషయంపై స్పష్టత రావడం లేదు. నిన్నటిదాకా ఓ మాట చెప్పిన బీసీసీఐ.. తాజాగా మాట మార్చింది. 

PREV
18
IPL Auction Date: నిన్నో మాట..! నేడో మాట..!! ఇంతకీ ఐపీఎల్ మెగా వేలమెప్పుడు..?

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం నిర్వహణలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పూటకో మాట మారుస్తున్నది. 

28

వారం రోజుల క్రితం వరకు మెగా వేలాన్ని జనవరి మూడో వారంలో నిర్వహిస్తామని మీడియాకు లీకులిచ్చిన బీసీసీఐ.. నిన్ననేమో ఫిబ్రవరి 7,8 తేదీలలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తన  ప్రతినిధులతో చెప్పించింది. 

38

ఇక ఇప్పుడేమో తాజాగా.. ఈ మెగా ఈవెంట్ ను  ఫిబ్రవరి 12, 13  తేదీలలో నిర్వహించాలని భావిస్తున్నట్టు జాతీయ  మీడియాలలో కథనాలు వస్తున్నాయి. ఈ రెండు తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆ కథనాల సారాంశం. 

48

ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారం కూడా అందించిందని తెలుస్తున్నది. వేలానికి సంబంధించిన ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని  ఫ్రాంచైజీలకు సూచించినట్టు  సమాచారం. 

58

ఇదిలాఉండగా.. అన్నీ కుదిరితే ఫిబ్రవరి 7, 8 న ఐపీఎల్ వేలాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ అధికారి ఒకరు  పీటీఐకి తెలిపాడు. ‘కరోనా తీవ్రత పెరిగితే తప్ప.. ఐపీఎల్ మెగా వేలం భారత్ లోనే ఉండే అవకాశముంది. ఈ మేరకు బెంగళూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి..’ అని కూడా వివరించిన సంగతి తెలిసిందే. 

68

కానీ ఇప్పుడేమో ఏకంగా ఫ్రాంచైజీలకు కూడా సమాచారమందించామని, తేదీలను కూడా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేనిని నమ్మాలో  తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.  

78

ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన సీవీసీ క్యాపిటల్స్ (అహ్మాదాబాద్) వివాదం దాదాపు సద్దుమణిగినట్టేనని, రేపో మాపో ఆ జట్టుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మెగా వేలం పై కూడా బీసీసీఐ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.  

88

కాగా.. ప్రతి మూడేండ్లకోసారి జరిగే వేలం వల్ల జట్ల సమతూకం దెబ్బతింటున్నదని పలు ఫ్రాంచైజీలు ఆరోపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో  ఇదే చివరి వేలం కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. 

click me!

Recommended Stories