ఆ ఇద్దరినీ పట్టించుకోని సౌతాఫ్రికా... ఐపీఎల్ టైటిల్ గెలిచినందుకు అతనికి మాత్రం విషెస్ చెబుతూ...

First Published Oct 16, 2021, 1:41 PM IST

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. గత కొంత కాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్న సఫారీ జట్టు, ఇప్పుడు సీనియర్లను పట్టించుకోకుండా చేస్తున్న పనుల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది..

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే సీనియర్లు ఇమ్రాన్ తాహీర్, ఫాఫ్ డుప్లిసిస్, క్రిస్ మోరిస్‌లతో పాటు మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌ను కూడా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆడించాలని ప్రయత్నించింది సౌతాఫ్రికా బోర్డు...

అయితే ఏబీ డివిల్లియర్స్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఏబీడీ ఒప్పుకోకపోవడంతో మిగిలిన సీనియర్లను కూడా జట్టును దూరంగా పెట్టింది...

వన్డే, టీ20లకు అందుబాటులో ఉండేందుకు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఫాఫ్ డుప్లిసిస్. టీ20 లీగుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కూడా...

గత సీజన్‌లో సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన డుప్లిసిస్, ఈ సీజన్‌లో 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్‌ను అందుకునే అవకాశాన్ని కోల్పోయాడు...

అయితే ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న లుంగి ఇంగిడిని విష్ చేస్తూ, ఓ ట్వీట్ చేసింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారిక ట్విట్టర్ ఖాతా...

అయితే చెన్నై సూపర్ కింగ్స్‌లో సౌతాఫ్రికా పేసర్ లుంగి ఇంగిడితో పాటు సీనియర్ బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డుప్లిసిస్, సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ కూడా ఉన్నారు...

డుప్లిసిస్ అయితే ఫైనల్ మ్యాచ్‌లో 80 పరుగులతో అదరగొట్టి ‘మ్యాన్ ఆఫ ది ఫైనల్’ అవార్డు కూడా గెలిచాడు. అయినా డుప్లిసిస్‌ పేరును కానీ, ఇమ్రాన్ తాహీర్ పేరును కానీ ప్రస్తావించలేదు సౌతాఫ్రికా క్రికెట్...

ఈ ట్వీట్‌పై ఫాఫ్ డుప్లిసిస్... ‘అవునా...’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా... సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, ఏకంగా సఫారీ బోర్డుపై ఎదురుదాడికి దిగాడు...

‘ఈ అకౌంట్‌ను ఎవరు నడిపిస్తున్నారు. ఫాఫ్ డుప్లిసిస్ ఇంకా రిటైర్ అవ్వలేదు, ఇమ్రాన్ కూడా రిటైర్ కాలేదు. సౌతాఫ్రికా జట్టుకి ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఈ ఇద్దరూ... కనీసం ప్రస్తావించడానికి కూడా తగరా? ఇది దారుణం...’ అంటూ ట్వీట్ చేశాడు డేల్ స్టెయిన్...

‘సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా జనాలకు తప్పుడు సంకేతాలు ఇస్తోంది. వాటిని నడిపిస్తున్నది ఎవరు? వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఉంది..’ అంటూ మరోట్వీట్ చేశాడు డేల్ స్టెయిన్...

లుంగి ఇంగిడి మీద వేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో కామెంట్లను ఆఫ్ చేసింది సౌతాఫ్రికా బోర్డు. దీంతో ఇలా కాదు, ముందు ఆ పోస్టుని డిలీట్ చేసి, సీఎస్‌కేలోని సౌతాఫ్రికా ఆటగాళ్లందరి పేర్లను చేరుతూ పోస్టు చేయండి అంటూ ట్వీట్ చేశాడు డేల్ స్టెయిన్...

ఇదీ చదవండి: కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు రెస్ట్... ఆవేశ్, గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్... కివీస్‌తో టీ20 సిరీస్‌కి...

 సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... 

IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

click me!