Sourav Ganguly: దాదాకు ‘ది ప్రిన్స్ ఆఫ్ కోల్కతా’ అనే పేరు ఎలా వచ్చింది..? ఆ పేరు పెట్టిందెవరు..?

Published : Jul 08, 2022, 12:06 PM IST

Happy Birthday Sourav Ganguly: టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.  దాదా గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 

PREV
18
Sourav Ganguly: దాదాకు ‘ది ప్రిన్స్ ఆఫ్ కోల్కతా’ అనే పేరు ఎలా వచ్చింది..? ఆ పేరు పెట్టిందెవరు..?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు 50వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. 90 లలో సచిన్ టెండూల్కర్ హవాను తట్టుకుని నిలిచిన గంగూలీని ‘ప్రిన్స్ ఆఫ్ కోల్కతా’ అని పిలుస్తారు. ఈ పేరుతో పాటు దాదాకు మరికొన్ని నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. 

28

1972 జులై 8న కోల్కతా లో జన్మించిన  గంగూలీ.. 1992 లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. వన్డేలలో ఆడిన నాలుగేండ్ల (1996లో)కు గానీ అతడికి టెస్టులు ఆడే అవకాశం రాలేదు. 90వ దశకంలో గంగూలీ తన బ్యాటింగ్ విన్యాసాలతో అందరినీ అలరించాడు. 

38

సచిన్ తో పోటీ పడుతూ పరుగులు చేసిన గంగూలీకి నిక్ నేమ్స్ చాలానే ఉన్నాయి. గంగూలీ ఆటతీరు చూసిన అభిమానులు అతడిని ‘రాయల్ బెంగాల్ టైగర్’, ‘దాదా’, ‘ది గాడ్ ఆఫ్ ఆఫ్ సైడ్’ అని పిలిచేవారు. మరి దాదాకు ‘ది ప్రిన్స్ ఆఫ్ కోల్కతా’ అని పేరు పెట్టిందెవరో తెలుసా..? 

48

90లలో  తన బ్యాటింగ్ విన్యాసాలతో ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన దాదా ఆటకు ముగ్దుడైన ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్.. గంగూలీని ‘ది ప్రిన్స్ ఆఫ్ కోల్కతా’ అని బిరుదిచ్చాడు. 
 

58

ఉన్నత కుటుంబంలో జన్మించిన గంగూలీని అతడి తల్లిదండ్రులు ‘మహారాజ్’ (ప్రిన్స్) అని పిలిచేవారు. కోల్కతాకు చెందినవాడు కాబట్టే బాయ్కాట్ దాదా పేరుకు అతడి నగరాన్ని జోడించి ‘ది ప్రిన్స్ ఆఫ్ కోల్కతా’ అని పిలిచాడు. యువకుడిగా ఉన్న సమయంలో దాదా..  అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవాడు.  

68

దాదా ఆఫ్ సైడ్ ఆడటంలో దిట్ట.  స్క్వేర్ కట్, స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్ లు ఆడినప్పడు గంగూలీ బ్యాటింగ్ చూసి తీరాల్సిందే. ఇక ఫ్రంట్ ఫుట్ కు వచ్చాడంటే బంతి స్టాండ్స్ లో ఉండాల్సిందే. ఆఫ్ సైడ్ కవర్స్ మీదుగా అతడు కొట్టే సిక్సర్ల మజా ఏంటో నైంటీస్ కిడ్స్ (వీరినే మిలినీయల్స్ గా పిలుస్తారు) కే తెలుసు.

78

సాధారణంగా గంగూలీ బ్యాటింగ్ చేసేప్పుడు క్రీజును దాటడు. కానీ దాటాడంటే ఆ బంతి అయితే బౌండరీ లైన్ అయినా దాటాలి లేదంటే స్టాండ్స్ లో ఎవరో ఒక ప్రేక్షకుడి చేతుల్లో అయినా ఉండాల్సిందే. 
 

88

తన కెరీర్ లో 311 వన్డేలు, 113 టెస్టులు ఆడాడు దాదా. టెస్టులలో 7,212 పరుగులు, వన్డేలలో 11,363 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 38 సెంచరీలు చేశాడు. టెస్టులలో దాదా సగటు  తన కెరీర్ మొత్తంలో 40కి తగ్గిన దాఖలాలు లేవు. ఇక వన్డేలలో ఈ కోల్కతా ప్రిన్స్  సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. 

click me!

Recommended Stories