గంగూలీ ముందు ఇది తెలుసుకో, ఆ విషయం వాళ్లు చూసుకుంటారు... దిలీప్ వెంగ్‌సర్కార్ కామెంట్స్...

First Published Dec 23, 2021, 9:40 AM IST

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంపై అంటుకున్న చిచ్చు, ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. సెలక్టర్లు చేసిన దాన్ని, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెనకేసుకురావడాన్ని భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తప్పుబట్టారు...

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో సెలక్టర్లు... విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారని కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

అయితే సెలక్టర్ల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేదని, ఆ విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలని దాదాకి కౌంటర్ ఇచ్చాడు దిలీప్ వెంగ్‌సర్కార్...

‘సెలక్షన్ కమిటీ తరుపున సౌరవ్ గంగూలీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అతనికి ఆ అధికారం కూడా లేదు. ఎందుకంటే గంగూలీ, భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు...

సెలక్షన్ గురించి, కానీ లేదా కెప్టెన్సీ మార్పు గురించి ఏదైనా వివాదం రేగితే... దాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ చూసుకుంటాడు. సెలక్టర్లు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ వివరించాల్సి ఉంటుంది...

కెప్టెన్‌ని ఎంపిక చేయడానికి, లేదా తీసివేయడానికి సెలక్షన్ కమిటీకి పూర్తి అధికారం ఉంటుంది. జట్టును ఎంపిక చేసే విషయంలో కూడా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి వేలుపెట్టే అధికారం ఉండదు...

విరాట్ కోహ్లీకి, అతనికి అభిమానులకు క్లారిటీ ఇచ్చేందుకు సౌరవ్ గంగూలీ ఈ విషయం గురించి మాట్లాడి ఉండొచ్చు. అయితే మరి సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ ఏం చేస్తున్నాడు... 

1932లో తొలిసారి భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి సెలక్షర్లకు ప్లేయర్లను, కెప్టెన్‌ని ఎంపిక చేసే అధికారం ఉంది. ఓ సారి ఐదు టెస్టుల్లో నలుగురు కెప్టెన్లు మారడాన్ని కూడా చూశాం...

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కోహ్లీ, సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. విరాట్‌ కోహ్లీ భారత క్రికెట్‌కి చేసిన సేవలు మరువలేనివి...

ఎన్నో రికార్డులు, మరెన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీని ఇలా తప్పించడం,  అతన్ని, తన అభిమానులను కచ్ఛితంగా నొప్పించి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ కెప్టెన్, క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్షర్ దిలీప్ వెంగ్‌సర్కార్...

వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన తర్వాత గంగూలీ చేసిన కామెంట్లను ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో విరాట్ కొట్టిపారేయడంతో బీసీసీఐ అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తప్పించాలని విరాట్ కోహ్లీ అభిమానులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

click me!