ICC rankings: మరింత దిగజారిన కోహ్లీ, 20 టెస్టులకే టాప్‌లోకి మార్నస్ లబుషేన్...

Published : Dec 23, 2021, 09:19 AM ISTUpdated : Dec 23, 2021, 09:22 AM IST

సరిగ్గా 20 అంటే 20 టెస్టులు మాత్రమే ఆడిన అనుభవం ఉన్న ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లాడు...

PREV
112
ICC rankings: మరింత దిగజారిన కోహ్లీ, 20 టెస్టులకే టాప్‌లోకి మార్నస్ లబుషేన్...

పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చినా, 2019 యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ గాయం కారణంగా తప్పుకోవడంతో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా రీఎంట్రీ ఇచ్చిన లబుషేన్... అక్కడి నుంచి అదరగొడుతూ టెస్టుల్లో తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. 

212

ఐసీసీ టెస్టు ఫార్మాట్‌లో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌ రూల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మ్యాచ్ మధ్యలో మరో ప్లేయర్ స్థానంలో క్రీజులోకి  వచ్చిన మొట్టమొదటి క్రికెటర్ కూడా లబుషేన్ కావడం విశేషం...

312

ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన లబుషేన్, ఆ తర్వాతి మ్యాచ్‌లో 185 పరుగులు చేసి టెస్టుల్లో తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు...

412

యాషెస్ సిరీస్ 2021-22లో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన లబుషేన్, ఆడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 305 బంతుల్లో 8 ఫోర్లతో 103 పరుగులు చేసి, డే టెస్టులో మూడో సెంచరీ చేశాడు...

512

పింక్ బాల్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన లబుషేన్, రెండో ఇన్నింగ్స్‌లో 96 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేశాడు...

612

యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందు రెండో స్థానంలో ఉన్న లబుషేన్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లాడు...

712

మార్నస్ లబుషేన్ 912 పాయింట్లతో టాప్‌లో ఉండగా, జో రూట్ 897 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో, కేన్ విలియంసన్  నాలుగో స్థానంలో ఉన్నారు...

812

భారత టెస్టు ఓపెనర్ రోహిత్ శర్మ 797 పాయింట్లతో టాప్ 5లో ఉండగా, డేవిడ్ వార్నర్ టాప్ 6లో, విరాట్ కోహ్లీ ఏడో స్థానంలో ఉన్నాడు. 

912

ఈ ఏడాది ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ టాప్ 5లో ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఆ రికార్డును ఏడాది చివరికల్లా కోల్పోయాడు...

1012

డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టులో విరాట్ కోహ్లీ చేసే పరుగులు, ఈ ఏడాది క్లోజింగ్‌కి తన ర్యాంకుని నిర్ణయించబోతున్నాయి...

1112

వన్డేల్లో రెండో ర్యాంకులో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా టాప్ 11వ స్థానానికి పడిపోయాడు. టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో లోకేశ్ రాహుల్ ఒక్కటే భారత జట్టు తరుపున టాప్ 5లో ఉన్నాడు...

1212

రోహిత్ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో, డేవిడ్ మలాన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌ టాప్ 2,3 ర్యాంకుల్లోకి దూసుకొచ్చారు. వన్డేల్లో టాప్ ర్యాంకులో ఉన్న బాబర్ ఆజమ్, టెస్టుల్లో 9వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories