సౌరవ్ గంగూలీ స్పెషాలిటీ అదే... సచిన్, ధోనీ కాదు, ‘దాదా’ బయోపిక్ తీస్తే...

First Published Jul 8, 2021, 11:37 AM IST

టీమిండియా ఆటతీరును పూర్తిగా మార్చివేసిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ... మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని, వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టుకి సారథిగా బాధ్యతలు తీసుకున్న గంగూలీ, అద్వితీయ విజయాలను అందించాడు...

స్టీవ్ వా, రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో కెప్టెన్‌గా భారత జట్టును విజయపథంలో నడిపించాడు సౌరవ్ గంగూలీ...
undefined
అగ్రెసివ్ కెప్టెన్ అంటే అందరికీ విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తాడు, ఇంటెలిజెంట్ కెప్టెన్ అంటే మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకువస్తాడు... అయితే ఈ రెండు కలగలిపిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ...
undefined
కోహ్లీలా అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో, ధోనీలా ఇంటెలిజెంట్ కెప్టెన్సీలో భారత జట్టులో మ్యాచ్ విన్నర్లకు అవకాశం ఇచ్చాడు సౌరవ్ గంగూలీ...
undefined
మహేంద్ర సింగ్ ధోనీ, యువకుల కోసం టాపార్డర్ నుంచి మిడిల్ ఆర్డర్‌కి వెళితే... సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు...
undefined
అందుకే వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ గురించి చేసిన కామెంట్, క్రికెట్ ప్రపంచంలోనే హాట్ టాపిక్ అయ్యింది...
undefined
‘సచిన్ టెండూల్కర్ బయోపిక్ తీస్తే, అది ‘మాస్టర్’ క్రికెట్‌లో ఎదిగిన విధానాన్ని చూపిస్తుంది... అలాగే ధోనీ బయోపిక్‌లో మాహీ ఎదిగిన విధానం మాత్రమే తెలుస్తుంది. అదే గంగూలీ బయోపిక్ తీస్తే, అది భారత జట్టు ఎదిగిన పరిస్థితులను చూపిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
‘భారత జట్టు ఎప్పటికీ సౌరవ్ గంగూలీకి రుణపడి ఉంటుంది. ప్రతీ పరిస్థితిలో నుంచి బెస్ట్ తీసుకొచ్చిన కెప్టెన్. క్రికెట్‌లో నీ అంకిత భావం, ఎన్నో తరాలకు ఆదర్శప్రాయం’ అంటూ దాదాకి విష్ చేశాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా...
undefined
‘భారత క్రికెట్ చీకట్లో బిక్కుబిక్కుమంటున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు గంగూలీ... టీమిండియాను ఓ సూపర్ పవర్‌గా మార్చాడు... అత్యుత్తమ కెప్టెన్‌కి బర్త్ డే విషెస్’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
undefined
1932 నుంచి సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే 2000 వరకూ భారత జట్టు విదేశాల్లో 156 టెస్టులు ఆడి, 70 మ్యాచుల్లో ఓడి 73 డ్రా చేసుకుని, కేవలం 13 మ్యాచుల్లో మాత్రమే గెలవగలిగింది...
undefined
అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదేళ్ల కాలంలో భారత జట్టు 30 టెస్టుల్లో 12 విజయాలు అందుకుంది. విజయాల శాతం 40. అంతకుముందు 68 ఏళ్ల సాధించిన విజయాల శాతం 8.33 మాత్రమే...
undefined
సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునేదాకా 8 ఏళ్లల్లో కూడా భారత జట్టు విజయాల శాతం కేవలం 28.89 మాత్రమే... అంటే గంగూలీ కెప్టెన్‌గా జట్టుపై ఎలాంటి ముద్ర వేశాడో అర్థం చేసుకోవచ్చు...
undefined
click me!