ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ అరుదైన రికార్డు... ఆరంగ్రేటం నుంచి నూరో టెస్టు దాకా...

First Published Feb 5, 2021, 11:11 AM IST

ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్... నేడు కెరీర్‌లో నూరో టెస్టు ఆడుతున్న వియం తెలిసిందే. ఆరంగ్రేటం చేసిన దేశంపైనే మొదటి టెస్టు, 100వ టెస్టు ఆడిన అరుదైన ప్లేయర్ల లిస్టులో చోటు దక్కించుకున్నాడు జో రూట్... ప్రస్తుతం 100 అంతకంటే ఎక్కువ మ్యాచులు ఆడిన ప్లేయర్లలో ఐదో క్రికెటర్ జో రూట్ కావడం మరో విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా బ్యాటింగ్ చేస్తోంది...

2012లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఆరంగ్రేటం చేశాడు జో రూట్. 2016లో వైజాగ్‌లో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ జో రూట్ కెరీర్‌లో 50వ మ్యాచ్... ప్రస్తుతం చెన్నైలో ఇండియా ప్రత్యర్థిగా తన 100వ టెస్టు ఆడుతున్నాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్..
undefined
ఇంతకుముందు కపిల్ దేవ్ పాకిస్థాన్‌పై ఆరంగ్రేటం చేసి అదే దేశంపై 100వ టెస్టు ఆడగా... కార్ల్ హుపర్, భారత్‌పై ఎంట్రీ ఇచ్చి, టీమిండియాపైనే నూరో టెస్టు ఆడాడు. అయితే మొదటి, 50వ, 100వ టెస్టు ఒకే దేశంపై, ఒకే దేశంలో ఆడిన మొట్టమొదటి క్రికెటర్ మాత్రం జో రూట్.
undefined
అతి చిన్న వయసులో 100 టెస్టులు పూర్తిచేసుకున్న మూడో క్రికెటర్ జో రూట్. ఇంతకుముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ 28 ఏళ్ల 353 ఏళ్ల వయసులో నూరు టెస్టులు పూర్తిచేసుకోగా సచిన్ టెండూల్కర్ 29 ఏళ్ల 133 రోజుల వయసులో నూరో టెస్టు ఆడాడు. ప్రస్తుతం జో రూట్ వయసు 30 ఏళ్ల 37 రోజులు...
undefined
టెస్టు ఆరంగ్రేటం చేసిన తర్వాత అతి తక్కువ రోజుల్లో వందో టెస్టు ఆడుతున్న రెండో ప్లేయర్ జో రూట్. ఇంతకుముందు అలెస్టర్ కుక్ మొదటి టెస్టు తర్వాత 2844 రోజులకు నూరో టెస్టు ఆడగా జో రూట్ 2976 రోజులకు 100వ టెస్టు ఆడుతున్నాడు. ఈ లిస్టులో 3558 రోజుల తర్వాత 100వ టెస్టు ఆడిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా నుంచి 10వ స్థానంలో ఉన్నాడు.
undefined
ప్రస్తుతం టెస్టు క్రికెట్ ఆడుతున్న వారిలో జేమ్స్ అండర్సన్ 158 టెస్టులు, స్టువర్ట్ బ్రాడ్ 145, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ 105, ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ 100 టెస్టులు మాత్రమే జో రూట్ కంటే ఎక్కువ టెస్టులు ఆడారు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తర్వాత 100, అంతకంటే కంటే ఎక్కువ టెస్టులు ఆడి క్రికెట్‌లో కొనసాగుతున్న ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్.
undefined
నేడు స్వదేశంలో మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న జస్ప్రిత్ బుమ్రా... విదేశాల్లో ఇప్పటికే 17 మ్యాచుల్లో 79 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో టెస్టు ఆరంగ్రేటం కంటే ముందే సీనియర్ పేసర్, ఆరంగ్రేటం ప్లేయర్‌కి క్యాప్ అందించిన బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌కి టెస్టు క్యాప్ అందించాడు జస్ప్రిత్ బుమ్రా...
undefined
click me!