ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు: వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...

Published : Feb 05, 2021, 11:38 AM IST

మొదటి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లాండ్... గత 13 టెస్టుల్లో అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లాండ్ ఓపెనింగ్ జోడి... రోరీ బర్న్స్ అవుటైన తర్వాత కొద్దిసేపటికే లారెన్స్ డకౌట్.. 64 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్..

PREV
15
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు: వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో 63 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కి ఓపెనర్లు రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ కలిసి శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ మొదటి వికెట్‌కి 63 పరుగులు జోడించారు. 

25

గత 13 టెస్టుల్లో ఇండియాలో ఇంగ్లాండ్‌కి ఇదే అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం కావడం విశేషం. శ్రీలంకలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 34 పరుగులే జోడించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు, టీమిండియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేయడం విశేషం.

35

. 2017, మార్చిలో ఆస్ట్రేలియా తర్వాత భారత్‌లో టీమిండియాపై ప్రత్యర్థి జట్టు మొదటి వికెట్‌కి 50+ భాగస్వామ్యం నెలకొల్పడం, 20+ ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి. 60 బంతుల్లో 2 ఫోర్లతో 33 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. 

45

అశ్విన్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోరీ బర్న్స్. ఇన్నింగ్స్ ఏడో బంతికి రోరీ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ జారవిరచడం విశేషం. ఆ తర్వాత రెండో ఓవర్‌లోనే డానియల్ లారెన్స్‌ను జస్ప్రిత్ బుమ్రా డకౌట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు లారెన్స్. బుమ్రాకి ఇది స్వదేశంలో తొలి వికెట్ కావడం విశేషం. 

55

లంచ్ విరామ సమయానికి 27 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఓపెనర్ డోమినిక్ సిబ్లీ 26 పరుగులతో, కెప్టెన్ జో రూట్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు...

click me!

Recommended Stories