స్మృతి మంధాన సంపాదన ఎంతో తెలుసా... అందంలోనే కాదు, ఆదాయంలోనూ మోత మోగిస్తున్న మహిళా క్రికెటర్...

Published : Feb 14, 2021, 12:26 PM IST

ఇక్కడే కాదు, ఏ దేశంలో అయినా పురుషుల క్రికెట్‌కి ఉన్న ఫాలోయింగ్, మహిళల క్రికెట్‌కి ఉండదు. అయితే పురుషాధిక్య క్రికెట్ ప్రపంచంలోనూ తనకంటూ క్రేజ్, పాపులారిటీ తెచ్చుకున్న అతికొద్ది మహిళా క్రికెటర్లలో స్మృతి మంధాన ఒకరు. 24 ఏళ్ల ఈ యంగ్ క్రికెటర్, తన అందంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోయే స్మృతి మంధాన... క్రికెట్‌లోనే కాదు, ఆదాయంలోనూ అదరగొడుతోంది.

PREV
19
స్మృతి మంధాన సంపాదన ఎంతో తెలుసా... అందంలోనే కాదు, ఆదాయంలోనూ మోత మోగిస్తున్న మహిళా క్రికెటర్...

ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నవారిలో స్మృతి మంధాన టాప్ 3లో ఉంది. భారత క్రికెట్‌కి విరాట్ కోహ్లీ సూపర్ మ్యాన్ అయితే, స్మృతి మంధాన ‘వండర్ వుమెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’... ఆమెకి వచ్చిన క్రేజ్ కారణంగానే మహిళల క్రికెట్ కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు కుర్రాళ్లు...

29

ఆరంగ్రేటం టెస్టులో అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన... ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ‘వైస్ కెప్టెన్’గా ఎదిగింది. 

39

టీమిండియా తరుపున 51 వన్డేలు ఆడిన స్మృతి మంధాన... 17 హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలతో 2025 పరుగులు చేసింది. రెండు టెస్టుల్లో 81 పరుగులు చేసింది... 75 టీ20 మ్యాచుల్లో 1716 పరుగులు చేసింది స్మృతి మంధాన...

49

ఐసీసీ వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులను కూడా గెలుచుకున్న స్మృతి మంధాన... 2019, ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించింది.

59

2016లో వుమెన్ టీమ్‌ ఆఫ్ ది ఇయర్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్‌గా నిలిచిన స్మృతి మంధాన... అండర్ 19 టోర్నమెంట్‌లో 150 బంతుల్లో 224 పరుగులు చేసి చరిత్ర క్రియేట్ చేసింది...

69

తనకి వచ్చిన స్టార్ స్టేటస్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్న స్మృతి మంధాన... ‘నైక్’ వంటి కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహారిస్తోంది. ఇలా ఏటా కోటి దాకా ఆర్జిస్తోంది స్మృతి మంధాన...

79

అంతేకాకుండా టీమిండియా ప్లేయర్‌గా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ప్లేయర్లలో స్మృతి మంధాన ఒకరు. టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఇద్దరూ బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా ఏటా రూ.50 లక్షలు అందుకుంటున్నారు...

89

అదీకాకుండా ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్, టీ20 వుమెన్స్ లీగ్ వంటి లీగుల్లో పాల్గొంటున్న ఆమె... తన స్వగ్రామంలో ‘ఎస్.ఎం. 18’ అనే పేరుతో ఓ కేఫ్ నడిపిస్తోంది... ఇది కాకుండా ఎయిర్ ఆప్టిక్స్, బాటా, రెడ్ బుల్, హీరో మోటర్స్ వంటి టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంది స్మృతి మంధాన...

99

ఇలా మొత్తంగా స్మృతి మంధాన సంపాదన రూ.22 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న భారత పురుష క్రికెటర్లతో పోలిస్తే, ఇది చాలా తక్కువే అయినా భారత్‌లో ఓ మహిళా క్రికెటర్ ఈ రేంజ్‌లో సంపాదించడం అంటే చాలా పెద్ద విషయమే...

click me!

Recommended Stories