INDvsENG: నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, లంచ్ బ్రేక్ ముందు ఆఖరి బంతికి...

First Published Feb 14, 2021, 11:39 AM IST

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకి ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, స్వల్ప స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ తీసుకోవడానికి ఆఖరి బంతికి డానియల్ లారెన్స్ అవుట్ కావడం విశేషం.   రోరీ బర్న్స్  డకౌట్ కావడంతో మొదటి ఓవర్‌లోనే సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్, 23 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తొలి టెస్టులో డబుల్ సెంచరీతో అదరగొట్టిన జో రూట్‌ను మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 

ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే రోరీ బర్న్స్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు ఇషాంత్ శర్మ. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 1987లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత ఇరు జట్లు సున్నాకే తొలి వికెట్ కోల్పోవడం ఇదే మొదటిసారి...
undefined
తొలి టెస్టులో 87 పరుగులతో రాణించిన డొమినిక్ సిబ్లీ... 25 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేశాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సిబ్లీ. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన టీమిండియా, ఫలితాన్ని రాబట్టింది. 16 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
undefined
ఆరంగ్రేటం టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్, తన రెండో ఓవర్‌లోనే జో రూట్‌ను పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఆడిన జో రూట్ 6 పరుగులు చేసి అక్షర్ పటేల్‌ బౌలింగ్‌లో స్విప్ షాట్‌కి ప్రయత్నించి, రవిచంద్రన్ అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
ఆసియాలో జో రూట్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, అవుట్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. గాయం కారణంగా తొలి టెస్టు ఆడలేకపోయిన అక్షర్ పటేల్, రెండో టెస్టులో ఎంట్రీతోనే అద్భుతమైన వికెట్ సాధించాడు...
undefined
23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్‌. డానియల్ లారెన్స్, బెన్ స్టోక్స్ కలిసి మరో వికెట్ పడకుండా బ్యాటింగ్ కొనసాగించారు. అయితే లంచ్ బ్రేక్ సమయానికి ముందు రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి లారెన్స్ అవుట్ అయ్యాడు.
undefined
52 బంతుల్లో 9 పరుగులు చేసిన డానియల్ లారెన్స్, శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 39 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్‌కి వెళ్లింది ఇంగ్లాండ్...
undefined
రెండో రోజు తొలి సెషన్‌లో 8 వికెట్లు పడడం విశేషం. టీమిండియా 29 పరుగులు చేసిన 4 వికెట్లు కోల్పోయి, ఇంగ్లాండ్ 39 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.
undefined
click me!