స్మృతి మంధాన బాయ్‌ఫ్రెండ్ అతడేనా... ఏడాదిగా సీక్రెట్‌గా డేటింగ్‌లో టీమిండియా క్రికెటర్?..

Published : Aug 02, 2023, 04:04 PM IST

ఆట కంటే ఎక్కువగా అందంతో యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ స్మృతి మంధాన. భారత మహిళా టీమ్‌ కెప్టెన్‌ ఎవరో తెలియని వారికి కూడా స్మృతి మంధాన అంటే క్రష్ ఉంటుంది. 27 ఏళ్ల స్మృతి మంధాన ప్రేమాయణం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

PREV
17
స్మృతి మంధాన బాయ్‌ఫ్రెండ్ అతడేనా... ఏడాదిగా సీక్రెట్‌గా డేటింగ్‌లో టీమిండియా క్రికెటర్?..

స్మృతి మంధానకి భారత క్రికెటర్ సంజూ శాంసన్ అంటే భలే ఇష్టం. అతని ఆటను చూసేందుకు చాలా దూరం ప్రయాణించి వెళ్లేదానినని చాలా సార్లు ప్రకటించింది స్మృతి మంధాన. అయితే సంజూ శాంసన్‌కి ఎప్పుడో పెళ్లి అయిపోయింది..

27
Ellyse Perry and Smriti Mandhana

అయితే స్మృతి మంధాన, బాలీవుడ్ సింగర్ పలక్ ముచ్ఛల్ తమ్ముడు పలాష్ ముచ్ఛల్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం పలాష్ ముచ్ఛల్, సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలే..

37

స్మృతి మంధాన, సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్‌గా ఉంటుంది. అయితే పలాష్ ముచ్ఛల్ షేర్ చేసిన ఫోటోల్లో అతని చేతిపైన ‘ఎస్‌ఎం’ (స్మృతి మంధాన షార్ట్ కట్) అని రాసి ఉండడం... హాట్ టాపిక్ అవుతోంది..

47


అదీకాకుండా స్మృతి మంధాన, పలాష్‌ భుజంపై చాలా క్లీజ్‌గా ఫోటోలకు ఫోజిచ్చింది. దీంతో ఈ ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి..
 

57
Smriti Mandhana-Harmanpreet Kaur

ప్రస్తుతం ది హాండ్రెడ్ లీగ్ కోసం ఇంగ్లాండ్‌లో ఉంది స్మృతి మంధాన. 2023 హాండ్రెడ్ లీగ్‌లో మొదటి పరుగు, మొదటి ఫోర్, మొదటి సిక్సర్, మొదటి హాఫ్ సెంచరీ, మొదటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచింది స్మృతి మంధాన..

67

ది హాండ్రెడ్ టోర్నీ ముగిసిన తర్వాత ఆసియా క్రీడల కోసం చైనా బయలుదేరి వెళ్లనుంది స్మృతి మంధాన. బంగ్లాదేశ్ టూర్‌లో అతి ప్రవర్తన కారణంగా భారత కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్‌పై రెండు మ్యాచుల నిషేధం విధించింది ఐసీసీ...

77
Image: Palash Muchhal/Instagram

దీంతో ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచుల్లో భారత మహిళా క్రికెట్ టీమ్‌కి స్మృతి మంధాన, కెప్టెన్‌గా వ్యవహరించబోతోంది. క్వార్టర్ ఫైనల్ గెలిస్తేనే, సెమీస్ చేరే భారత జట్టు, సెమీ ఫైనల్‌లోనూ గెలిస్తేనే ఫైనల్ ఆడుతుంది...  సెమీ ఫైనల్‌లో ఓడితే కాంస్య పతకం కోసం పోటీపడుతుంది.

click me!

Recommended Stories