శ్రేయాస్ అయ్యర్‌కి టీమిండియా టెస్టు కెప్టెన్సీ ఇవ్వాలి! శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్ సూచన...

Published : Aug 02, 2023, 02:44 PM IST

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగించుకున్న భారత జట్టు, మరో ఆరు నెలల వరకూ సుదీర్ఘ ఫార్మాట్‌కి దూరంగా ఉండబోతోంది. డిసెంబర్‌లో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్‌లో ఆడనుంది టీమిండియా. అప్పటికి రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగడానికి ఆసక్తి చూపిస్తాడా?   

PREV
18
శ్రేయాస్ అయ్యర్‌కి టీమిండియా టెస్టు కెప్టెన్సీ ఇవ్వాలి! శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్ సూచన...
Image credit: Getty

ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్ అయితే, టీమిండియా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి దక్కుతాయి? విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత  రోహిత్ శర్మతో పాటు ఓ టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా, మూడు టెస్టులకు కెఎల్ రాహుల్ కెప్టెన్లుగా వ్యవహరించారు...

28

బంగ్లాదేశ్ టూర్‌లో రెండు టెస్టుల్లో విజయాలు అందుకున్న కెఎల్ రాహుల్, సౌతాఫ్రికాతో జరిగిన జోహన్‌బర్గ్ టెస్టులో పరాజయాన్ని అందుకున్నాడు. టీమిండియాకి జోహన్‌బర్గ్‌లో దక్కిన మొట్టమొదటి టెస్టు పరాజయం ఇదే...

38

రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఇంగ్లాండ్‌లో జరిగిన ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌కి కెఎల్ రాహుల్ కూడా అందుబాటులో లేకపోవడంతో బుమ్రా కెప్టెన్సీలో టెస్టు ఆడిన భారత జట్టు, పరాజయాన్ని అందుకుంది..

48

ఈ ఇద్దరితో పాటు భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని ఫ్యూచర్ టెస్టు కెప్టెన్‌గా చూస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. అయితే అతను కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తాడనే విషయంలో సందిగ్ధత నెలకొంది..
 

58
Shreyas Iyer

‘నా అభిప్రాయంలో శ్రేయాస్ అయ్యర్ బెస్ట్ కెప్టెన్ అవుతాడు. తన తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. అతనికి మంచి లీడర్‌షిప్ స్కిల్స్ ఉన్నాయి. ఐపీఎల్‌లో అతని కెప్టెన్సీని చూశాం..

68

శ్రేయాస్ అయ్యర్, యంగ్ టీమ్‌ని కూడా చక్కగా హ్యాండిల్ చేయగలిగాడు. నా ఉద్దేశంలో టీమిండియాకి శ్రేయాస్ అయ్యర్ మంచి టెస్టు కెప్టెన్ అవ్వగలడు...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్...

78
Shreyas Iyer

ఇప్పటిదాకా 10 టెస్టు మ్యాచులు ఆడిన శ్రేయాస్ అయ్యర్, 44.40 సగటుతో 666 పరుగులు చేశాడు. గాయం కారణంగా మార్చిలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు నుంచి తప్పుకున్న శ్రేయాస్ అయ్యర్, ఐదు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు.. 

88

కెఎల్ రాహుల్ కూడా ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడ్డాడు. టెస్టుల్లో నిలకడైన ప్రదర్శన చూపించలేక టీమ్‌లో చోటు కోల్పోయాడు. ఐర్లాండ్ టూర్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న జస్ప్రిత్ బుమ్రాకే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం కనబడుతోంది.. 

click me!

Recommended Stories