అప్పట్లో గంభీర్, యువరాజ్, రైనా ఉండేవాళ్లు! ఇప్పుడు శిఖర్ ధావన్‌ని తీసుకొస్తేనే... టీమిండియాకి పాక్ మాజీ సలహా

First Published Aug 2, 2023, 3:16 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియానే హాట్ ఫెవరెట్. అయితే ప్రపంచ కప్‌కి ముందు వింతవింత ప్రయోగాలతో టీమ్ వాతావరణాన్ని చెడగొడుతోంది మేనేజ్‌మెంట్. గత ఏడాదిన్నరలో టీమిండియా రకరకాల ఓపెనింగ్ జోడీలను ప్రయోగించింది..
 

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా రకరకాల ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది టీమిండియా. మూడో వన్డేలో గెలిచి, సిరీస్ కైవసం చేసుకుంది కానీ కాస్త తేడా కొడితే... భారత జట్టు పరువు పూర్తిగా పోయేది...

‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా ఓ సాధారణ టీమ్ మాత్రమేనని తేలిపోయింది. ఈ ఇద్దరూ ఉండడం వల్లే టీమ్‌ కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.

Yuvraj Singh

ఇంతకుముందు ధోనీ లేక మిగిలిన స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తే... సురేష్ రైనా, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి బ్యాటర్లు, టీమ్‌ భారాన్ని మోసేవాళ్లు...

Rohit Sharma-Shikhar Dhawan

ఇప్పుడు టీమిండియాకి అలాంటి లగ్జరీ లేదు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న కుర్రాళ్లు, వన్డే క్రికెట్‌లో నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది. అయితే వన్డే వరల్డ్ కప్‌లోపు టీమిండియా చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుంది..

అయినా ఇప్పటికిప్పుడు కుర్రాళ్లను వన్డే వరల్డ్ కప్‌కి సిద్ధం చేసే కంటే శిఖర్ ధావన్‌లాంటి సీనియర్ ప్లేయర్‌ని వాడుకోవడం మంచిది. శుబ్‌మన్ గిల్‌తో శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేస్తే.. రోహిత్ శర్మ వన్‌డౌన్‌లో, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో వస్తే సరిపోతుంది..

ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ లేదా సంజూ శాంసన్, కెఎల్ రాహుల్ లేదా శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లు ఉన్నారు. గౌతమ్ గంభీర్ అవసరమైతే ఓపెనింగ్ చేసేవాడు, లేదంటే మిడిల్ ఆర్డర్‌లో వచ్చేవాడు. అలాంటి సౌకర్యం ఉండడం చాలా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్.. 

click me!