ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన స్మృతి మంధాన-ప్రతికా రావల్

Published : Sep 14, 2025, 05:26 PM IST

Smriti Mandhana Pratika Rawal : భారత స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ జోడీ మహిళల వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన జోడీగా ఘనత సాధించింది.

PREV
15
స్మృతి-ప్రతికా జోడీ కొత్త చరిత్ర

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ చరిత్ర సృష్టించారు. ఆదివారం (సెప్టెంబర్ 14న) ముల్లాన్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో చరిత్ర సృష్టించారు. ఒకే సంవత్సరంలో ఒక జోడీ సాధించిన అత్యధిక పరుగుల రికార్డును వీరు బద్దలు కొట్టారు. 2025లో వీరిద్దరూ కలసి 958 పరుగులు సాధించారు. ఇంతకుముందు 2000లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బెలిండా క్లార్క్, లీసా కైట్‌లీ జోడీ సాధించిన 905 పరుగుల రికార్డును భారత జోడీ బ్రేక్ చేసింది.

25
ఆస్ట్రేలియాతో 114 పరుగుల భాగస్వామ్యం

ముల్లాన్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన స్మృతి-ప్రతికా జోడీ 21.3 ఓవర్లలో 114 పరుగులు సాధించింది. స్మృతి మంధాన 63 బంతుల్లో 58 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) కొట్టగా, ప్రతికా రావల్ 96 బంతుల్లో 64 పరుగులు (6 ఫోర్లు) చేసింది. ఇది భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చింది.

35
ఐదోసారి సెంచరీ భాగస్వామ్యంతో మెరిసిన స్మృతి-ప్రతికా

మహిళల వన్డే క్రికెట్‌లో స్మృతి-ప్రతికా జంట ఐదోసారి 100కి పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. భారత మహిళల తరఫున 100+ భాగస్వామ్యాలు అత్యధికంగా సాధించిన ఓపెనింగ్ జంట ఇదే. ఇతర జంటల్లో జయ శర్మ-కరుణ జైన్, జయ శర్మ-అంజు జైన్ కూడా ఐదు సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నా, స్మృతి-ప్రతికా కేవలం 15 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించారు.

45
హర్మన్‌ప్రీత్ కౌర్ 150వ వన్డే

ఈ మ్యాచ్ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ప్రత్యేకమైనది. ఇది ఆమె కెరీర్‌లో 150వ వన్డే కావడం విశేషం. మిథాలీ రాజ్, ఝూలన్ గోస్వామి తర్వాత ఈ మైలురాయి చేరిన మూడో భారత క్రికెటర్ హర్మన్‌ప్రీత్. అయితే ప్రత్యేక మ్యాచ్‌లో ఆమె కేవలం 9 బంతుల్లో 11 పరుగులకే ఔటయ్యారు.

55
టీమిండియా రికార్డుల వర్షం

• స్మృతి-ప్రతికా జంట ఇప్పటి వరకు 15 ఇన్నింగ్స్‌లో 1200 పరుగులు జోడించారు. ఇది మహిళల వన్డే చరిత్రలో అత్యధిక రన్‌రేట్‌ (6.06) కలిగిన భాగస్వామ్యం.

• ఆస్ట్రేలియాపై వీరి 114 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం, 50 ఓవర్ల ఫార్మాట్‌లో మూడో అత్యధిక స్కోరు. 2009లో క్యారోలిన్ అట్‌కిన్స్-సారా టేలర్ 119, 2014లో హేలీ మాథ్యూస్-కైషా నైట్ 115 పరుగులు జోడించారు.

• ప్రతికా రావల్ తన 15 వన్డేల్లోనే 750 పరుగులు సాధించి, ఆరు హాఫ్ సెంచరీలు , ఒక సెంచరీ సాధించారు. ఆమె సగటు దాదాపు 58 కావడం విశేషం.

భారత జట్టు బలమైన బ్యాటింగ్ శక్తి

స్మృతి-ప్రతికా జంట విజయవంతంగా ఆరంభం ఇవ్వడంతో పాటు, జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ వంటి బ్యాటర్లు ఉండటంతో భారత్ రాబోయే ప్రపంచకప్‌లో బలమైన జట్టుగా నిలవనుంది.

Read more Photos on
click me!

Recommended Stories