భారత్ vs పాకిస్తాన్ : ఆసియా కప్ లో ఆపరేషన్ సూర్య.. ఏం జరగనుంది?

Published : Sep 14, 2025, 04:33 PM IST

India vs Pakistan: ఆసియా కప్‌ 2025 లో ఆదివారం భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా బలంగా ఉంది. స్పిన్ బౌలింగ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. 

PREV
15
భారత్ vs పాకిస్తాన్ : ఆపరేషన్ సూర్య

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు మరింత దారుణంగా మారాయి. అదే సమయంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ మాదిరిగానే, సూర్యకుమార్ యాదవ్ సేన ఈసారి ఆసియా కప్‌లో ఆపరేషన్ ‘సూర్య’తో పాకిస్థాన్‌ను మట్టికరిపించాలని సిద్ధమవుతోంది. ప్రస్తుతం పేపర్‌పై కానీ, మైదానంలో కానీ పాకిస్థాన్ జట్టు భారత జట్టుకు సరితూగేలా కనిపించడం లేదు.

25
భారత్ vs పాకిస్తాన్ : జట్ల బలం–బలహీనతలు ఇవే

భారత జట్టులో శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి దూకుడుగా, ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే బ్యాటర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ పేసర్‌తో పాటు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే లాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు మరింత బలాన్ని అందిస్తున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్నారు.

పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నేతృత్వం వహిస్తున్నారు. వారి బలమైన ఆటగాళ్లలో సయీమ్ అయూబ్, హసన్ నవాజ్, ఫఖర్ జమాన్ ఉన్నారు. స్పిన్ విభాగంలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముకీన్, మహ్మద్ నవాజ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.

35
భారత్ vs పాకిస్తాన్ : మ్యాచ్ వాతావరణం, అభిమానుల స్పందనలు

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు భారత్‌లో కొంత అసహనం కనిపిస్తోంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ బహిష్కరించాలని సోషల్ మీడియా వేదికలపై పిలుపులు వస్తున్నాయి. బీసీసీఐ, కేంద్రం ఈ మ్యాచ్ నిర్వహణపై విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ, టీమిండియా పాకిస్థాన్‌పై విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా ఆనందోత్సవాలు జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.

45
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ లో వీరి మధ్య కీలక పోటీలు

• అభిషేక్ శర్మ వర్సెస్ షాహీన్ అఫ్రిది: అభిషేక్ శర్మ ఆరంభంలో భారీ షాట్లు కొట్టడంలో నైపుణ్యం కలవాడు. అతనికి షాహీన్ అఫ్రిది కొత్త బంతితో సవాలు విసరనున్నాడు.

• గిల్ వర్సెస్ హారిస్ రౌఫ్: శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో ఉన్నాడు. అతని ఎదుట హారిస్ రౌఫ్ వేగం, లైన్‌తో పరీక్షించనున్నాడు.

• హార్దిక్ వర్సెస్ సల్మాన్: ఇరువురూ బ్యాట్, బౌలింగ్‌లో జట్టుకు సహకారం అందించగలరు.

• బుమ్రా వర్సెస్ సయీమ్ అయ్యూబ్: బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ ఎదుట సయీమ్ నిలవగలడా అన్నది ఆసక్తికరంగా మారనుంది.

• కుల్దీప్ వర్సెస్ ఫఖర్ జమాన్: మధ్య ఓవర్లలో కుల్దీప్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఫఖర్ జమాన్ జాగ్రత్తగా ఉండాలి.

55
భారత్ vs పాకిస్తాన్ జట్లు

భారత్ జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్.

పాకిస్థాన్ జట్టు: ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, ఖుష్‌దిల్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ ఆఘా, హుస్సేన్ తలత్, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ హారిస్, సాహిబ్‌జాదా ఫర్హాన్, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీన్, మహ్మద్ వసీం జూనియర్. 

ఇప్పటివరకు ఆసియా కప్‌లో జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ లలో టీమిండియాదే ఆధిపత్యం. 2022లో యూఏఈలో పాకిస్థాన్ భారత్‌పై చివరిసారి గెలిచింది. ఈసారి స్పిన్ బౌలర్ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భారత్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో మ్యాచ్‌లో ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories