2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్మృతి మంధాన, ఇప్పటివరకు టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు.
• టెస్టులు: 9 మ్యాచ్‌ల్లో 788 పరుగులు (2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు)
• వన్డేలు: 120 మ్యాచ్‌ల్లో 5,411 పరుగులు (14 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు)
• టీ20లు: 179 మ్యాచ్‌ల్లో 4,792 పరుగులు (2 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు, 101 సిక్సర్లు)
మొత్తంగా 308 మ్యాచ్‌ల్లో 18 సెంచరీలు, 76 అర్ధ సెంచరీల సాయంతో 11,001* పరుగులు పూర్తి చేశారు. టీ20 ఫార్మాట్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె సెమీఫైనల్లో రికార్డు సాధించారు.