Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 114 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. షఫాలీ వర్మ మెరుపు సెంచరీతో రికార్డు సృష్టించింది. ఈ విజయంతో భారత జట్టు ఫైనల్ చేరుకుంది. ఫైనల్ పోరులో శ్రీలంకతో తలపడనుంది.
జపాన్‌లో జరిగిన ఆసియా గేమ్స్ 2026 ఉమెన్స్ క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 114 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 81 పరుగులకే కుప్పకూలింది.
25
షెఫాలీ వర్మ చరిత్రాత్మక సెంచరీ
భారత ఓపెనర్ షెఫాలీ వర్మ గ్రౌండ్‌లో సిక్సర్లు, ఫోర్లతో బంగ్లా బౌలర్లను చెడుగుడు ఆడుకుంది. కేవలం 49 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి రికార్డు సృష్టించింది. ఉమెన్స్ ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెంచరీ చేసిన మొదటి ప్లేయర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఫుల్ మెంబర్ టీమ్స్ ప్లేయర్ల రికార్డును కూడా షెఫాలీ వర్మ సమం చేసింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
35
కుప్పకూలిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ దిలారా అక్తర్ 23 బంతుల్లో 27 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలోనే 81 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెంచారు. నందని శర్మ తన స్పెల్‌లో 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, శ్రీ చరణి చెరో 2 వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ సాధించారు. బౌలింగ్ చేసిన ప్రతీ ఒక్కరూ వికెట్ తీసి జట్టు విజయంలో భాగమయ్యారు.
55
గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో శ్రీలంకతో పోరు
ఈ గెలుపుతో భారత్ కనీసం వెండి పతకాన్ని ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 22న జరగనుంది. గోల్డ్ మెడల్ కోసం భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. గతంలో 2024 హాంగ్‌జౌ ఆసియా గేమ్స్, ఆసియా కప్‌లలో జరిగిన మ్యాచ్‌లకు ఇది రీమ్యాచ్ కానుంది. మరోవైపు కాంస్య పతకం కోసం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది.