క్రికెట్‌కి వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధం ఏంటి? కోహ్లీని ఫాలో కావడం వల్లే ప్లేయర్లకు గాయాలు... - సెహ్వాగ్

First Published Mar 21, 2023, 2:24 PM IST

టీమిండియాని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్య గాయాలు. రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, దీపక్ చాహార్,  శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్... ఇలా గాయాలతో బాధపడుతూ జట్టుకి వరుసగా దూరమవుతున్న ప్లేయర్ల సంఖ్య చాలానే ఉంది. గాయం నుంచి కోలుకున్న ప్లేయర్లు, మళ్లీ గాయపడడానికి కారణం ఏంటి?
 

Virender Sehwag

టీమిండియాలోకి రావాలంటే యో-యో టెస్టు పాస్ కావడాన్ని తప్పనిసరి చేసింది బీసీసీఐ. ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాకపోవడం వల్లే సర్ఫారాజ్ ఖాన్‌, పృథ్వీ షా వంటి సత్తా ఉన్న యంగ్ ప్లేయర్లకి టీమ్‌లో చోటు దక్కడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై సీరియస్ అయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

Sehwag-Ganguly

‘యో- యో టెస్టు పాస్ కాకపోతే టీమిండియాలో ఆడేందుకు అర్హులు కాదనేది నేను వింటున్నా. మా టైమ్‌లో ఇదే రూల్ ఉండి ఉంటే లెజెండరీ ప్లేయర్లు చాలామంది టీమ్‌లో చోటు కూడా దక్కించుకునేవాళ్లు కాదు. ఎందుకంటే వాళ్లంతా కచ్ఛితంగా యో యో టెస్టు ఫెయిల్ అయ్యేవాళ్లు...

నేను, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే.. ఎవ్వరం కూడా యో-యో టెస్టు పాస్ అయ్యేవాళ్లం  కాదు. అయితే మా టైమ్‌లో స్కిల్స్‌పైన ఫోకస్ పెట్టేవాళ్లు. ఫిట్‌నెస్ ఎలా ఉన్నా మ్యాచులు గెలిపించే సామర్థ్యం ఉందా? లేదా? అనేది మాత్రమే చూసేవాళ్లు...

Kohli -Sehwag

ఎవరు బాగా పరుగులు చేయగలుగుతున్నారు? ఎవరు బాగా వికెట్లు తీయగలుగుతున్నారు... ఈ రెండు విషయాలు మాత్రమే చూసి టీమ్‌లోకి సెలక్ట్ చేసేవాళ్లు. యో-యో టెస్టు పాస్ కావాలంటే కిలో మీటర్ల దూరం పరుగెత్తాలి. అలా పరుగెత్తేవాళ్లు, వెళ్లి మారథాన్‌లో పాల్గొనాలి. వాళ్లకి క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని నా నమ్మకం...

ఇప్పుడు టైం పూర్తిగా మారిపోయింది. మేమయితే బాగా బ్యాటింగ్ చేసి స్కిల్స్‌ని పెంచుకోవాలని చూసేవాళ్లం. ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లం. జిమ్ వర్కవుట్స్ వల్ల ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడవచ్చేమో. అయితే ప్రతీ ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. క్రికెట్‌కి వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధం లేదు...
 

Virat Kohli

క్రికెటర్లు, వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ శరీరం వెయిట్ లిఫ్టింగ్‌కి సహకరిస్తే, బరువులు ఎత్తడంలో తప్పులేదు. ఒకవేళ మీ శరీరం సహకరించకపోతే వెన్ను సమస్యలు, కీళ్ల సమస్యలు వస్తాయి. అందుకే ఫిట్‌నెస్ కంటే స్కిల్స్‌ చాలా ముఖ్యం...

విరాట్ కోహ్లీ బరువులు ఎత్తుతున్నాడు. ఫిట్‌గా ఉంటూ ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతున్నాడని అందరూ అతనిలా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందరూ విరాట్ కోహ్లీలు కాలేరు. బుమ్రా, దీపక్ చాహార్ వెన్ను సమస్యలతో బాధపడడానికి ఇదే కారణం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

click me!