ప్రతీసారీ ఇంజిన్ మారుస్తూ పోతే, టైటిల్ ఎలా గెలుస్తారు... పంజాబ్ కింగ్స్‌పై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్...

First Published Mar 21, 2023, 1:48 PM IST

ఐపీఎల్‌లో ఎక్కువ మంది కెప్టెన్లను వాడిన టీమ్ పంజాబ్ కింగ్స్. ఇప్పటిదాకా 15 సీజన్లు జరిగితే 14 మంది కెప్టెన్లను మార్చింది పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్. 2023 సీజన్‌లోనూ కొత్త కెప్టెన్‌తో బరిలో దిగనుంది పంజాబ్ కింగ్స్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కెఎల్ రాహుల్ కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. ఆ మ్యాచ్‌కి మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ చేసి, టీమ్ మేనేజ్‌మెంట్‌ని మెప్పించాడు. దీంతో 2022 సీజన్‌లో మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా నియమించింది పంజాబ్ కింగ్స్...

Image credit: PTI

2022 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ గాయం కారణంగా ఓ మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కి కెప్టెన్సీ చేసి, మేనేజ్‌మెంట్‌ని మెప్పించాడు శిఖర్ ధావన్. 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు శిఖర్ ధావన్...
 

Image credit: PTI

యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఐపీఎల్‌ని మొదలెట్టిన పంజాబ్ కింగ్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, జార్జ్ బెయిలీ, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్.. ఇలా సీజన్లు మారే కొద్దీ కెప్టెన్లను మారుస్తూ పోయింది. 38 ఏళ్ల శిఖర్ ధావన్, ఈ సీజన్‌లో లేదా వచ్చే సీజన్‌లో రిటైర్ అయితే మళ్లీ కొత్త కెప్టెన్ రూటులోకి వస్తాడు..

Image credit: PTI

‘బండి సరిగా నడవాలంటే ఇంజిన్ చాలా ముఖ్యం. ఇంజిన్ సరిగా ఉంటే టైటిల్ గెలవచ్చు. కానీ పంజాబ్ కింగ్స్, ప్రతీ సీజన్‌కి ముందు ఇంజిన్‌ని మారుస్తోంది. ప్రతీ ఐపీఎల్‌ తర్వాత కీ ప్లేయర్లను తప్పిస్తారు, కెప్టెన్‌ని మారుస్తారు, కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తారు...
 

Image credit: PTI

నేను పంజాబ్ కింగ్స్ తరుపున మూడేళ్లు ఆడాడు. పంజాబ్ కింగ్స్‌లో సీమ్ బౌలర్లకు, బ్యాక్ స్పిన్ బౌలర్లకు చక్కని సహకారం లభిస్తుంది. ఎందుకంటే మొహాలీ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ షాట్స్ ఆడడం చాలా కష్టం. లెంగ్త్ ఎక్కడ పడాలో తెలుసుకుంటే వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాదు..

Image credit: PTI

లెంగ్త్ తప్పితే ఏ బౌలర్ అయినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. సామ్ కుర్రాన్, కగిసో రబాడా, అర్ష్‌దీప్ సింగ్ చాలా క్వాలిటీ బౌలర్లు. ఇప్పటికే తమను తాము నిరూపించుకున్న వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. అర్ష్‌దీప్ సింగ్, కుర్రాన్ రూపంలో పంజాబ్‌కి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉన్నారు...
 

Image credit: PTI

కగిసో రబాగా రైట్ ఆర్మ్ పేసర్ అయినా లెంగ్త్ పక్కాగా ఫాలో అవుతాడు. నిజానికి ఐపీఎల్ 2023 సీజన్‌లో భీకరమైన బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్ పంజాబ్ కింగ్సే. అయితే ఈసారి కూడా టైటిల్ ఫెవరెట్స్‌లో ఆ టీమ్ కనిపించడం లేదు. ఎందుకనేది టీమ్ మేనేజ్‌మెంట్‌కి బాగా తెలుసు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్‌ని రూ.18 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ మొత్తం దక్కించుకున్న ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు సామ్ కుర్రాన్..

click me!