కుంబ్లేతో గొడవ తర్వాత కోహ్లీ నా దగ్గరికి వచ్చాడు! హెడ్ కోచ్‌గా రమ్మని కోరాడు.. - వీరేంద్ర సెహ్వాగ్

Published : Mar 21, 2023, 11:42 AM IST

అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన గొడవలు అంతా ఇంతా కాదు. హెడ్ కోచ్‌కీ, కెప్టెన్‌కీ మధ్య మనస్పర్థలు రావడం, అభిప్రాయ బేధాలు వచ్చి ఒకరినొకరు దూషించుకునేదాకా వెళ్లింది పరిస్థితి. ఈ ఇద్దరి మధ్య సఖ్యత తెచ్చేందుకు బీసీసీఐ, స్వయంగా సచిన్, ద్రావిడ్, గంగూలీలను దింపినా ఫలితం దక్కలేదు...

PREV
17
కుంబ్లేతో గొడవ తర్వాత కోహ్లీ నా దగ్గరికి వచ్చాడు! హెడ్ కోచ్‌గా రమ్మని కోరాడు.. - వీరేంద్ర సెహ్వాగ్

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిస్తే మళ్లీ అనిల్ కుంబ్లే హెడ్ కోచ్‌గా కొనసాగుతాడనే భయంతోనే కోహ్లీ అండ్ టీమ్, కావాలనే పాక్ చేతుల్లో ఓడిందనే అనుమానాలు కూడా ఉన్నాయి.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడిన విధానానికి, ఫైనల్‌లో ఓడిన విధానానికి అస్సలు పొంతనే ఉండదు...
 

27

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతుల్లో 180 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఈ పరాజయం తర్వాత హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు అనిల్ కుంబ్లే. కుంబ్లే తర్వాత అప్పటిదాకా టీమిండియా క్రికెట్ డైరెక్ట్‌గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు..

37
kohli sehwag

రవిశాస్త్రి బాధ్యతలు తీసుకోవడానికి ముందు టీమిండియా హెడ్ కోచ్‌గా రావాల్సిందిగా బీసీసీఐ, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని కోరిందట. ఈ విషయాన్ని స్వయంగా అతనే బయటపెట్టాడు...

47
kohli sehwag

‘2017లో బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరీ, నన్ను కలిశాడు. విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మధ్య విబేధాలు తగ్గడం లేదు, పరిస్థితి ఏ మాత్రం మారడం లేదని చెప్పాడు. అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్ గడువు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ముగియనుందని, ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా నన్ను బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరాడు...

57

హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే వెస్టిండీస్ టూర్‌కి టీమ్‌తో కలిసి వెళ్లవచ్చని చెప్పాడు. అయితే నేను దానికి ఒప్పుకోలేదు. నేను క్రికెటర్‌గా సాధించిన దాంతో చాలా సంతోషంగా ఉన్నాను...

67

ఎక్కడో నజఫ్‌గర్‌లో ఓ చిన్న రైతు కుటుంబంలో పుట్టిన నేను, టీమిండియా తరుపున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాను. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. టీమిండియాకి కెప్టెన్‌గా కూడా చేశాను...

77

నాకంటూ కొంత గౌరవం సంపాదించుకున్నాను. అందుకే దాన్ని పొగొట్టుకోవడం ఇష్టం లేదని చెప్పాను.. అమితాబ్ చౌదరీతో పాటు విరాట్ కోహ్లీ కూడా నన్ను హెడ్ కోచ్‌గా రావాల్సిందిగా కోరాడు. అయితే నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

Read more Photos on
click me!

Recommended Stories