Jasprit Bumrah: టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా అద్బుత బౌలింగ్ తో అదరగొడుతూ అనేక రికార్డులు సృష్టించాడు. బుమ్రా కేవలం బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు.
Jasprit Bumrah
బుమ్రా బ్యాటింగ్ రికార్డును యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తో పాటు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా బ్రేక్ చేయలేకపోయారు. ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా గొప్ప బౌలర్‌గా గుర్తింపు పొందినప్పటికీ.. బ్యాటింగ్ లో కూడా చాలా మంది గొప్ప బ్యాటర్లు బ్రేక్ చేయని రికార్డు బుమ్రా పేరిట ఉంది.
Jasprit Bumrah
2022లో ఇంగ్లండ్ జట్టుకు బుమ్రా ఒక పీడకలగా మారాడు. అప్పటికే యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించాడు.
ఆ తర్వాత బుమ్రా కూడా అతని స్టువర్ట్ బ్రాడ్ గాయంపై కారంజల్లే విధంగా బ్యాటింగ్ తో షాకిచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో భారత స్టార్ బౌలర్ బుమ్రా ఏకంగా 35 పరుగులు సాధించాడు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుగా నిలిచింది.
Shami-Bumrah
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బుమ్రా 10వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి బ్రాడ్ బౌలింగ్ ను చిత్తు చేశాడు. తొలి బంతి ఫోర్ గా వచ్చింది. రెండో బంతి వైడ్+ఫోర్ తో 5 పరుగులు వచ్చాయి. మూడో బంతి నో బాల్+సిక్సర్ గా 7 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడు బంతులు బౌండరీలుగా మార్చాడు. చివరి రెండు బంతుల్లో ఒక సిక్సర్, ఒక పరుగు రావడంతో ఈ ఓవర్ లో మొత్తం 35 పరుగులు వచ్చాయి.