మొదటి వన్డే విజయం తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 వన్డే, టీ20, టెస్టు టీమ్‌గా నిలిచిన భారత జట్టు... రెండో వన్డే విజయంతో దాన్ని కాపాడుకోగలిగింది. మూడో వన్డేలో టీమిండియా ఓడినా, ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో నెం.1 టీమ్‌గా బరిలో దిగబోతోంది..
2015 వరల్డ్ కప్ సమయంలో టైటిల్ విన్నర్ ఆస్ట్రేలియా నెం.1 వన్డే టీమ్‌గా నిలిచింది. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కూడా నెం.1 వన్డే టీమ్‌గానే ప్రపంచ కప్ ఆడింది..
నెం.1 వన్డే టీమ్‌గా వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన గత రెండు జట్లు కూడా టైటిల్ గెలిచాయి. దీంతో ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు కొంతమంది టీమిండియా ఫ్యాన్స్...
అదీకాకుండా గత మూడు వన్డే వరల్డ్ కప్ టోర్నీలను ఆతిథ్య జట్లే కైవసం చేసుకున్నాయి. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు, ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇస్తూ టైటిల్ గెలిచిన మొట్టమొదటి టీమ్‌గా రికార్డు క్రియేట్ చేసింది..
2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ ఆ ఫీట్‌ని రిపీట్ చేశాయి. ఈసారి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగబోతోంది. దీంతో ఈసారి భారత జట్టు టైటిల్ విజేతగా నిలిచి తీరుతుందని నమ్ముతున్నారు క్రికెట్ ఫ్యాన్స్..