ఐపీఎల్, 2018 అండర్19 వరల్డ్ కప్ నుంచి టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్ శుబ్‌మన్ గిల్. U19 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా, టీమ్‌లో చోటు దక్కించుకోవడానికి అష్టకష్టాలు పడుతుంటే, శుబ్‌మన్ గిల్ మాత్రం టెస్టు, వన్డేల్లో దున్నేస్తూ టీ20ల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు... శుబ్‌మన్ గిల్ దగ్గర క్రికెట్ స్కిల్స్ ఎంతున్నాయో ‘ఎక్స్‌ట్రా’ స్కిల్స్ అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి...
Image Credit: Shubman Gill Instagram (L); Sara Tendulkar Instagram (R)
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుబ్‌మన్ గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నట్టు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో సారా టెండూల్కర్ ఫోటోలపై శుబ్‌మన్ గిల్ చేసిన కామెంట్లతో మొదలైన రచ్చ, రహస్యంగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారనే రూమర్ దాకా వెళ్లింది...
28
సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ కలిసి గోవాల్లో విహరిస్తున్నారని, లండన్‌లో షికార్లు చేస్తున్నారని అనేక రూమర్లు వచ్చాయి. అయితే వీటిల్లో నిజం ఎంత? అనేది మాత్రం ఇప్పటిదాకా తెలియలేదు. అయితే తాజాగా శుబ్‌మన్ గిల్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా ఆలీ ఖాన్‌తో కనిపించాడు...
38
భారత యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి సారా ఆలీ ఖాన్ ఓ రెస్టారెంట్‌లో కనిపించింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఒకే హోటల్ రూమ్ నుంచి రావడం, ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం చేయడం వంటివి మీడియా కంటపడ్డాయి. దీంతో సారా టెండూల్కర్‌తో బ్రేకప్ చెప్పుకున్న శుబ్‌మన్ గిల్, సారా ఆలీ ఖాన్ వెంటపడ్డాడని తేల్చేశారు నెటిజన్లు...
48
బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కూతురైన సారా ఇప్పటికే హర్షవర్థన్ రాణా, కార్తీక్ ఆర్యన్, ఇషాన్ కట్టర్, వీర్ పహారియా వంటి బాలీవుడ్ నటులతో ప్రేమాయణం నడిపింది. గిల్ గిల్లుడు లిస్టు కూడా చాలా పెద్దగానే ఉందని టాక్. తాజాగా శుబ్‌మన్ గిల్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు...
58
జీ పంజాబీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘దిల్ దియా గల్లాన్’ అనే టీవీ షోలో పాల్గొన్న శుబ్‌మన్ గిల్, ఆ షో హోస్ట్ సోనమ్ భజ్వా ‘బాలీవుడ్‌లో ఫిట్టెస్ట్ ఫీమేల్ యాక్టర్ ఎవరు?’ ప్రశ్నించింది. దానికి శుబ్‌మన్ గిల్.. ‘సారా’ అని సమాధానం ఇచ్చాడు... వెంటనే సోనమ్... ‘నువ్వు, సారాతో ఢేటింగ్ చేస్తున్నావా?’ అని ప్రశ్నించింది...
68
సారాతో ఢేటింగ్ విషయం గురించి ‘అవునేమో... (may be)’ అని సమాధానం ఇచ్చాడు శుబ్‌మన్ గిల్.. సోనమ్ ‘పూర్తిగా నిజం చెప్పు (సారా కా సారా సచ్ బోలో)’ అని అడగగా, గిల్ ‘సారా ద సారా సచ్ బోల్ దియా... అవునేమో! కాదేమో’... అంటూ ప్రశ్నార్థకం జోడించాడు... ఈ టీవీ షో, జీ 5 యాప్‌లో నవంబర్ 19న ప్రసారం కానుంది...
78
Image: Sara Ali Khan/Instagram
కొన్ని నెలల క్రితం ఓ టీవీ షోకి హాజరైన శుబ్‌మన్ గిల్‌కి సారా టెండూల్కర్‌తో ఢేటింగ్ చేస్తున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి శుబ్‌మన్ గిల్ నిర్మొహమాటంగా తాను సింగిల్ అని, ఏ అమ్మాయితో మింగిల్ అయ్యే ఉద్దేశం కూడా లేదని చెప్పాడు. సారా ఆలీ ఖాన్ విషయంలో మాత్రం చెప్పీ చెప్పినట్టుగా ‘అవునేమో’ అనడం చూస్తే.. వీళ్లిద్దరి మధ్య కథ చాలా దూరం వెళ్లినట్టే కనిపిస్తోంది..
88
సారాతో ప్రేమ, డేటింగ్ ఏమీ లేకుంటే ‘లేదని’ కరాఖండిగా చెప్పేసేవాడు. ఇలా ‘మే బీ... మే నాట్ బీ’ అని నాన్చడం చూస్తుంటే... శుబ్‌మన్ గిల్‌కి, సారాతో ప్రేమా, గీమా ఏదీ లేదని అబద్ధం చెప్పడం కూడా ఇష్టం లేదని తెలుస్తోందని అంటున్నారు బీ టౌన్ జనాలు...