వార్నర్ పాయె! కేన్ మామ లేకపాయె... మరి ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరు?...

First Published Nov 16, 2022, 12:22 PM IST

ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. 2013లో డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, మొదటి 8 సీజన్లలో ఆరు సార్లు ప్లేఆఫ్స్ చేరింది, రెండు సార్లు ఫైనల్ ఆడి.. 2016లో టైటిల్ విజేతగా నిలిచింది. అయితే రెండు సీజన్లుగా సన్‌రైజర్స్ కథ పూర్తిగా మారిపోయింది...

2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్ - టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలు రావడం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటపై తీవ్రంగా ప్రభావం చూపింది. 2021 సీజన్‌లో 14 మ్యాచుల్లో మూడంటే మూడు విజయాలు అందుకుని, ఆఖరి స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

2022 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌తో పాటు పూర్తి జట్టును వేలానికి వదిలేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు ఇద్దర్ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను మాత్రమే అట్టిపెట్టుకుంది. కేన్ విలియంసన్ కెప్టెన్సీలోనూ సన్‌రైజర్స్ ఆట మారలేదు...

14 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న ఆరెంజ్ ఆర్మీ, 8 మ్యాచుల్లో ఓడి 8వ స్థానానికి పరిమితమైంది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే కనిపించిన ఎస్‌ఆర్‌హెచ్, ఆ తర్వాత వరుసగా 6 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది...

ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా కేన్ విలియంసన్‌ని మినీ వేలానికి వదిలేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 2023 మినీ వేలంలో అతన్ని తిరిగి దక్కించుకునే అవకాశాలు తక్కువే. దీంతో ఈసారి సన్‌రైజర్స్‌ని నడిపించే కెప్టెన్ ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న ఆసక్తికరంగా మారింది...

వేలానికి విడుదల చేసిన ప్లేయర్లు పోగా, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హక్ ఫరూకీ... మాత్రమే జట్టులో మిగిలారు...

ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.42.25 కోట్ల భారీ మొత్తంతో బరిలో దిగుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే కొనుగోలు చేయాలనుకున్నా మినీ వేలంలో పాల్గొంటున్న వారిలో సరైన కెప్టెన్సీ అభ్యర్థి ఎవరూ లేరు. అజింకా రహానే, కరుణరత్నే వంటి టీ20లకు పనికి రాని సీనియర్లు మాత్రమే మినీ వేలంలో ఉన్నారు...

Image credit: PTI

మయాంక్ అగర్వాల్ లాంటి స్టార్ ప్లేయర్ వేలంలో పాల్గొంటున్నా, అతను పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా 2022 సీజన్‌లో ఫెయిల్ అయ్యాడు. దేశవాళీ టోర్నీల్లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్న జయ్‌దేవ్ ఉనద్కట్, మనీశ్ పాండే, బాబా ఇంద్రజిత్ వంటి కెప్టెన్లను ఐపీఎల్‌లో పట్టించుకోరు...

దీంతో ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపించే భారాన్ని సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కి అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా 7 మ్యాచులు ఆడిన భువీ, 2 విజయాలు అందుకున్నాడు. భువీ ట్రాక్ రికార్డు పట్టి అతను వద్దనుకుంటే సౌతాఫ్రికా బ్యాటర్ అయిడిన్ మార్క్‌రమ్‌కి కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి.
 

ఇవన్నీ రిస్క్ అనుకుంటే కేన్ విలియంసన్‌కి రూ.14 కోట్లు ఇవ్వడం వేస్ట్ అని భావించి మినీ వేలానికి వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, అతన్ని రూ.8-10 కోట్లకు తిరిగి దక్కించుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్... 

Rahul Tripathi

కేన్ విలియంసన్‌ని తిరిగి తీసుకుని కెప్టెన్సీ అప్పగిస్తారా? భువీకే ఆ భారం ఎత్తుతారా? లేక ఐపీఎల్ 2022 సీజన్‌లో రాహుల్ త్రిపాఠి వంటి కొత్త కెప్టెన్‌ని పరిచయం చేస్తారా? అనే విషయాలు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి..

click me!