అతడు మరో రోహిత్ శర్మ.. టీమిండియాకు ఫ్యూచర్ స్టార్.. యువ ఓపెనర్‌పై పాక్ మాజీ ఆటగాడి ప్రశంసలు

Published : Jan 22, 2023, 12:40 PM IST

INDvsNZ: నిలకడైన ప్రదర్శనలతో   అటు ఫ్యాన్స్ ను ఇటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల మన్ననలను పొందుతున్నాడు గిల్.  మరీ ముఖ్యంగా అతడి నిలకడను చూసి ఇప్పటికే చాలా మంది గిల్ ను  టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని అంటున్నారు. 

PREV
16
అతడు మరో రోహిత్ శర్మ.. టీమిండియాకు ఫ్యూచర్ స్టార్..  యువ ఓపెనర్‌పై  పాక్ మాజీ ఆటగాడి ప్రశంసలు

స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్ లతో  భారత్ వన్డే సిరీస్ లను గెలుచుకుంది.   రెండు సిరీస్ లతో పాటు  గత ఏడాదికాలంగా వన్డేలలో నిలకడగా రాణిస్తున్న  యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. భారత జట్టు విజయాలలో కీలకంగా మారుతున్నాడు.  తాజాగా ఈ  23 ఏండ్ల కుర్రాడు  డబుల్ సెంచరీ బాది రికార్డుల దుమ్ము దులిపాడు. 
 

26

తన  నిలకడైన ప్రదర్శనలతో   అటు ఫ్యాన్స్ ను ఇటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల మన్ననలను పొందుతున్నాడు గిల్.  మరీ ముఖ్యంగా అతడి నిలకడను చూసి ఇప్పటికే చాలా మంది గిల్ ను   మరో విరాట్ కోహ్లీ అవుతాడని,  రోహిత్ వారసుడని   ప్రశంసలు కురిపిస్తున్నారు. 

36

తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆ దేశ క్రికెట్ బోర్డు మాజీ చైర్మెన్ రమీజ్ రాజా  స్పందించాడు.   గిల్ డబుల్ సెంచరీ సాధించిన తర్వాత   రమీజ్ తన  యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు.  గిల్ టాలెంట్ ఉన్న క్రికెటర్ అని,  అతడిని చూస్తే మినీ రోహిత్ శర్మను చూసినట్టు ఉందని అంటున్నాడు. 

46

రమీజ్ మాట్లాడుతూ.. ‘గిల్ ను చూస్తుంటే ఓ చిన్న సైజ్ రోహిత్ శర్మను  చూసినట్టే ఉంది. చాలా యంగ్ ఏజ్ లోనే  గిల్ అదరగొడుతున్నాడు. అతడు సమర్థవంతమైన ఆటగాడు.   అనుభవం, దూకుడు  కాలానికనుగుణంగా అలవడతాయి.   గిల్ తన బ్యాటింగ్ లో  మార్చుకోవడానికి ఏమీ లేదు.  అతడి టెక్నిక్ అద్భుతం. 

56
Image credit: PTI

ఇటీవలే అతడు  బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదాడు. అందులో   కళాత్మకమైన ఇన్నింగ్స్ అనదగ్గ  డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇంక అటువంటి ఆటగాడికి  ఏం చెప్పగలం..   టీమిండియాకు ఫ్యూచర్  స్టార్ లా కనిపిస్తున్నాడు..  రోహిత్ తో  కలిసి ఓపెనర్ గా రావడం అతడికి   బలం వంటిది. రోహిత్ ప్రపంచ  స్థాయి బ్యాటర్.  హుక్ షాట్స్, పుల్ షాట్స్ ఆడటంలో అతడికి అతడే సాటి. గిల్ కూడా అతడి బాటలోనే నడుస్తున్నాడు..’అని కొనియాడాడు. 

66

గత ఏడాదికాలంగా నిలకడగా ఆడుతున్న గిల్.. ఈ ఏడాది లంకతో  సిరీస్  నుంచి రోహిత్ తో ఓపెనర్ గా వస్తున్నాడు.  ఈ ఇద్దరూ కలిసి   టీమిండియాకు శుభారంభాలు అందిస్తున్నారు.   రోహిత్, గిల్ ల  సూపర్ షో తో  భారత్..  మిడిలార్డర్  కూడా భారీ స్కోర్లు చేసేందుకు వీలు చిక్కుతున్నది.  

Read more Photos on
click me!

Recommended Stories