అతని బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం... ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా కామెంట్...

Published : Jan 22, 2023, 12:15 PM IST

రాహుల్ ద్రావిడ్ తర్వాత ఆ రేంజ్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో టెస్టు క్రికెట్‌లో ‘నయా వాల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. పూజారా ఒక్కసారి క్రీజులో సెటిల్ అయితే అతన్ని అవుట్ చేయడం చాలా పెద్ద విషయం...

PREV
16
అతని బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం... ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా కామెంట్...

గంటలకు గంటలు క్రీజులో కుదురుకుపోయి, ప్రత్యర్థి బౌలర్లకు విసుగు తెప్పించే ఛతేశ్వర్ పూజారా... కొన్నిసార్లు తొలి సింగిల్ తీయడానికి 50కి పైగా బంతులు వాడేసిన రోజులు కూడా ఉన్నాయి...
 

26
pujara

పేలవ ఫామ్‌తో సౌతాఫ్రికా టూర్ 2022 తర్వాత జట్టులో చోటు కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా... రంజీ ట్రోఫీలో ఆడి, ఆ తర్వాత కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 సీజన్‌లో పాల్గొని అదరగొట్టాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇచ్చి, టీమిండియాలోకి తిరిగి వచ్చాడు...

36

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి అవుటైన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతుల్లో 13 ఫోర్లతో 102 పరుగులు చేసి మూడేళ్ల బ్రేక్ తర్వాత సెంచరీ అందుకున్నాడు...

46

టెస్టులకు గ్యాప్ రావడంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ముందు రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో సౌరాష్ట్ర తరుపున ఆడుతున్నాడు ఛతేశ్వర్ పూజారా. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేశాడు పూజారా...

56
Cheteshwar Pujara

‘ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రస్తుత తరంలో ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం. అతను తన వేరియేషన్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. ఈసారి అతనిపై పైచేయి సాధించాలని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఛతేశ్వర్ పూజారా...

66
Pat Cummins

టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్న ప్యాట్ కమ్మిన్స్, 47 మ్యాచుల్లో 214 వికెట్లు తీశాడు. మరోవైపు ఛతేశ్వర్ పూజారా 98 టెస్టు మ్యాచుల్లో 7014 పరుగులు చేశాడు. ఆసీస్‌తో జరిగే రెండో టెస్టు పూజారా కెరీర్‌లో 100వ టెస్టు కానుంది..  

click me!

Recommended Stories