గుజరాత్‌కు షాకివ్వనున్న గిల్..! ఆ రెండు ఫ్రాంచైజీల వైపు చూపు..

Published : Jun 20, 2023, 06:19 PM IST

Shubman Gill: టీమిండియా యువ సంచలనం, ఐపీఎల్ లో  గత రెండు సీజన్ల నుంచి గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న శుభ్‌మన్ గిల్   వచ్చే సీజన్ లో   ఆ జట్టుకు షాకివ్వనున్నాడా..? 

PREV
17
గుజరాత్‌కు షాకివ్వనున్న గిల్..! ఆ రెండు ఫ్రాంచైజీల వైపు చూపు..

గడిచిన ఏడాదికాలంగా  భారత జట్టుతో పాటు ఇటీవలే ముగిసిన ఐపీఎల్ - 16 లో కూడా  నిలకడైన ఆటతీరుతో   భావి భారత స్టార్ గా ఎదుగుతున్న  శుభ్‌మన్ గిల్  వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఫ్రాంచైజీ మారనున్నాడా..?  గుజరాత్ టైటాన్స్ కు అతడు గుడ్ బై చెప్పనున్నాడా..?  భావి భారత సారథిగా ఎదుగుతున్న  గిల్..  ఐపీఎల్ లో కూడా ఒక ఫ్రాంచైజీకి   కెప్టెన్ గా మారనున్నాడా..? 

27
Image credit: PTI

ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది.    టీమిండియాలో కెప్టెన్సీ పోస్ట్ ఖాళీ  ఉన్న  నేపథ్యంలో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా  గుర్తింపు పొందిన గిల్.. ఆ స్థానాన్ని  చేజిక్కించుకోవడానికి    అడుగులు వేస్తున్నాడట.  ఇందులో భాగంగానే ఐపీఎల్ -17 నుంచే ఆ పనులు మొదలుపెట్టనున్నాడట.. 

37
Image credit: PTI

వచ్చే సీజన్ లో అతడు గుజరాత్  టైటాన్స్ కు గుడ్ బై చెప్పి  కెప్టెన్సీ లోటుతో  సతమతమవుతున్న  సన్ రైజర్స్ హైదరాబాద్ కు గానీ   పంజాబ్ కింగ్స్ కు గానీ  కెప్టెన్ గా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాడట. వచ్చే ఐపీఎల్ సీజన్ కు ఇంకా  సుమారు పది నెలల సమయం ఉంది.  ఆలోపు  మినీ వేలం కూడా జరిగే అవకాశం ఉంటుంది.  ఆలోపు  దీనిపై అతడు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తున్నది. 

47

పంజాబ్ గిల్ సొంత రాష్ట్రం.  ఆ జట్టు  ప్రతీ సీజన్ కు కెప్టెన్ ను మారుస్తూ నిలకడలేని ఆటతో చూసేవారికి కూడా విసుగు తెప్పిస్తున్నది. ఈ ఏడాది  ఆ జట్టుకు శిఖర్ దావన్ సారథిగా ఉన్నా గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు సామ్ కరన్ కెప్టెన్సీ చేశాడు. 

57
Image credit: PTI

ఇక సన్ రైజర్స్ విషయానికొస్తే  డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక   కేన్ విలిమయ్సన్ 2022 సీజన్ లో  సారథిగా ఉన్నాడు. ఈ ఏడాది అతడిని  హైదరాబాద్ రిటైన్   చేసుకోలేదు.  సౌతాఫ్రికాలో ఎస్ఎ20 లీగ్ గెలిచాడని  ఎయిడెన్ మార్క్రమ్ ను సారథిగా నియమించింది. సారథి మారినా సన్ రైజర్స్ రాత మారలేదు. 14 మ్యాచ్ లలో నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.  మార్క్రమ్ తనదైన ముద్రను వేయలేకపోయాడు. 

67
Image credit: PTI

ఈ రెండూ ఫ్రాంచైజీలు కూడా నిఖార్సైన, ఎక్కువకాలం తమకు అందుబాటులో ఉండే  సారథి కోసం చూస్తున్నాయి. ఇందుకు గిల్ అయితేనే బెటర్ ఆప్షన్  అన్న భావనలో హైదరాబాద్, పంజాబ్ భావిస్తున్నాయి.   అదీగాక  టీమిండియా సారథ్య పగ్గాలు చేపట్టాలంటే ఐపీఎల్ లో  ఆ సవాళ్లను స్వీకరించడం  కూడా గిల్ కు కలిసొచ్చేదే. అందుకే   ఇక్కడ మెలుకువలు నేర్చుకుని   జాతీయ జట్టు బాధ్యతలు చేపట్టవచ్చుని  అతడి భావన. 

77

అంతేగాక గుజరాత్ కు ఇప్పుడు హార్ధిక్ పాండ్యా సారథిగా ఉన్నాడు.  అతడు టీమిండియా కెప్టెన్సీ రేసులో కూడా ముందున్నాడు.   దీంతో అతడిని మరో ఆరేడేండ్ల దాకా గుజరాత్  సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పించే అవకాశాలైతే ప్రస్తుతానికి లేవు. దీంతో గుజరాత్ టీమ్ లో ఉంటే ఓపెనింగ్  బ్యాటర్ అన్న ట్యాగ్ మినహా కెప్టెన్సీ  ఆశలు నెరవేరవని గిల్ కూ తెలుసు. అందుకే అతడు ఇతర ఫ్రాంచైజీల వైపునకు చూస్తున్నాడని సమాచారం

Read more Photos on
click me!

Recommended Stories