టీమిండియా తరుపున టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించి, స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలో పేలవ ఫామ్‌తో టీమ్‌కి దూరమయ్యాడు మురళీ విజయ్.. భారత జట్టు తరుపున 61 టెస్టులు ఆడి 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేసిన మురళీ విజయ్, టీమ్ మేనేజ్‌మెంట్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
రోహిత్ శర్మ టెస్టుల్లో ఓపెనర్‌గా మారడంతో మురళీ విజయ్‌కి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. వరుసగా ఫెయిల్ అవుతున్న మురళీ విజయ్‌ని పక్కనబెట్టి, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్‌లను ఓపెనర్లుగా ఆడించింది టీమిండియా మేనేజ్‌మెంట్...
27
నాలుగేళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూసి 2023 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మురళీ విజయ్.. రిటైర్మెంట్ తర్వాత విదేశీ లీగుల్లో ఆడబోతున్నట్టు కూడా ప్రకటించాడు.
37
ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఇండియా మహారాజాస్ టీమ్ తరుపున ఆడుతున్న మురళీ విజయ్.. బీసీసీఐ తనకు అన్యాయం చేసిందని, సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆరోపణలు చేసిన మురళీ విజయ్, మరోసారి భారత క్రికెట్ బోర్డు రాజకీయాలపై ఫైర్ అయ్యాడు...
47
‘భారత జట్టు తరుపున 15 మంది సూపర్ స్టార్లు ఆడుతున్నారు. భారత జట్టు ఆడే ప్రతీ ప్లేయర్ కూడా నా దృష్టిలో సూపర్ స్టారే.. అయితే స్కిల్స్ పరంగా చూస్తే పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ఇద్దరే... ఎవ్వరినీ తీయలేం. ఎవ్వరినీ పెట్టలేం...
57
వాళ్లిద్దరూ టాప్ ప్లేయర్లు. శుబ్‌మన్ గిల్‌ని వరుసగా మూడు ఫార్మాట్లలో ఆడిస్తున్నారు మరి పృథ్వీ షాని ఎందుకు పట్టించుకోవడం లేదు. పృథ్వీ షా ఎందుకు ఆడడం లేదో నాకైతే అర్థం కావడం లేదు...
67
Shubman Gill
అతను దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నాడు. అయినా టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఎందుకో టీమ్ మేనేజ్‌మెంట్‌నే అడగాలి... రిషబ్ పంత్, టీమిండియాకి మంచి విజయాలు అందించాడు. అతను త్వరగా కోలుకుని టీమ్‌లోకి రావాలని కోరుకుంటున్నా. శ్రేయాస్ అయ్యర్ కూడా బాగా ఆడుతున్నాడు..
77
కెఎల్ రాహుల్ కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. అతన్ని కొన్నాళ్లు ఒంటరిగా వదిలేయడమే బెటర్. ప్రతీ క్రికెటర్ జీవితంలో ఇలాంటి ఫేజ్ చాలా కామన్. తన బేసిక్స్‌పైన వర్కవుట్ చేస్తే, తిరిగి రీఎంట్రీ ఇవ్వొచ్చు...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్..