ప్రాక్టీస్ మ్యాచ్‌లో డకౌట్ అయిన ఆ ప్లేయర్... కోహ్లీకి కరెక్ట్ రిప్లేస్‌మెంట్ అవుతాడట...

First Published Dec 7, 2020, 3:25 PM IST

భారత జట్టు రిజర్వు బెంచ్ చూస్తే... అందరికీ ఆశ్చర్యమేస్తుంది. భారత తుది జట్టులో చోటు దక్కించుకోవాలని ఎందరో సత్తా ఉన్న క్రికెటర్లు, ఎంతో కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ కొందరు యువ క్రికెటర్లు అద్భుతంగా ఆకట్టుకున్నారు. అయితే వీరిలో చాలామంది టీమిండియాలో ఛాన్స్ వస్తే, నిరూపించుకోలేక ఫెయిల్ అయ్యారు. అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం భవిష్యత్తులో విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా తయారవుతాడని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

మొదటి రెండు వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్... శిఖర్ ధావన్‌తో కలిసి మొదటి వికెట్‌కి 50+ భాగస్వామ్యాలు నెలకొల్పాడు...
undefined
అయితే వచ్చిన శుభారంభాన్ని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు మయాంక్ అగర్వాల్... దాంతో రెండు వన్డేల్లో ఓటమి అనంతరం జట్టులో మార్పులు చేశాడు కోహ్లీ.
undefined
మయాంక్ అగర్వాల్ స్థానంలో మరో యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌కి మూడో వన్డేలో ఛాన్స్ దొరికింది. వచ్చిన ఛాన్స్‌ను సరిగానే ఉపయోగించుకున్నాడు శుబ్‌మన్ గిల్.
undefined
39 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి వన్డేల్లో తన అత్యధిక స్కోరు నమోదుచేశాడు. ఇంతకుముందు 2019 జనవరిలో న్యూజిలాండ్‌తో రెండు వన్డేలు ఆడిన గిల్, అప్పుడు ఫెయిల్ అయ్యాడు.
undefined
శుబ్‌మన్ గిల్‌కి టీ20 జట్టులో అవకాశం దక్కలేదు. దాంతో ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న భారత్ ఏ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు శుబ్‌మన్ గిల్...
undefined
అయితే మొదటి రోజు, మొదటి బంతికే గోల్డెన్ డక్ రూపంలో పెవిలియన్ చేరాడు శుబ్‌మన్ గిల్. మరో యంగ్ సెన్సేషన్, శుబ్‌మన్ గిల్ అండర్ 19 జట్టు పార్టనర్పృథ్వీషా కూడా డకౌట్ కావడం విశేషం.
undefined
విండీస్ ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఏ తరుపున డబుల్ సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్... 19 ఏళ్ల 334 రోజుల వయసులో ద్విశతకం బాదిన యంగెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
ఈ డబుల్ సెంచరీ కారణంగానే టీమిండియా టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన గిల్... విరాట్ కోహ్లీ స్థానానికి సరిగ్గా సూట్ అవుతాడని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
undefined
‘మొదటి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీలో లీవ్‌లో వెళతాడు. కోహ్లీ ప్లేస్‌ను భర్తీ చేయాలంటే అతని సమానమైన టాలెంట్ ఉన్న క్రికెటర్ కావాలి... నా దృష్టిలో శుబ్‌మన్ గిల్ ఆ ప్లేస్‌కి సరిగ్గా న్యాయం చేయగలడు...
undefined
పృథ్వీషా, కెఎల్ రాహుల్‌లలో ఒకరు ఓపెనర్‌గా ఆడితే, శుబ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్‌లో రావాలి... నాలుగో స్థానంలో గిల్ చక్కగా రాణించగలడు... ’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆకాశ్ చోప్రా.
undefined
click me!